తిరుపతి: ఏపీలో భారత రాజ్యాంగం కాకుండా.. నారా లోకేశ్ రాసిన రెడ్ బుక్ అమలు అవుతోందని తిరుపతి, చిత్తూరు జిల్లాల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రెండేళ్లుగా కూటమి ప్రభుత్వం తనను వెంటాడి వేటాడుతోందని తెలిపారు.
‘‘కోర్టులు, వ్యవస్థలపై కూటమి పాలకులకు నమ్మకం లేదు. వ్యవస్థలను చేతిలో పెట్టుకుని నాట్యం చేయిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ నేతల మీద రెడ్ బుక్ పంజా విసురుతున్నారు. కలెక్టరే ఫిర్యాదుదారుగా ఓ కేసును నాపై పెట్టారు’’ అని తెలిపారు.
‘‘లోకేశ్ ఆదేశాలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పైన రాష్ట్రం అంతా రెడ్ బుక్ పంజా విసురుతున్నారు. తప్పుడు కేసులు బనాయించి జైలులో పెట్టిస్తున్నారు. ఈ రోజు మీది పై చేయి కావచ్చు.. ఏళ్లకాలం మీ ఆటలు సాగవు. మీ తప్పుడు కేసులు కు నేను భయపడను. సామాన్యుడికి న్యాయం జరుగుతుందా? లోకేశ్, చంద్రబాబు అన్ని వ్యవస్థల్ని చెడు చేయడానికి అధికారాన్ని వాడుతున్నారు. పచ్చ దొంగలు పచ్చిగా దొరికారు, న్యాయ పోరాటం చేస్తా’’ అని తెలిపారు.


