అగళి: రైతుల విషయంలోనూ రాజకీయాలు చేస్తారా.. అంటూ విద్యుత్ శాఖ అధికారులపై వైఎస్సార్ సీపీ మడకశిర నియోజకవర్గ సమన్వయకర్త ఈరలక్కప్ప మండిపడ్డారు. ట్రాన్స్‌ఫార్మర్ల పంపిణీ విషయంలో అధికారుల వైఖరిని నిరసిస్తూ సోమవారం రైతులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలతో కలసి స్థానిక వైఎస్సార్ విగ్రహం వద్ద నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈరలక్కప్ప మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సీనియార్టీ ప్రకారమే ట్రాన్స్‌ఫార్మర్లను పంపిణీ చేస్తామని చెప్పిన ఏఈ మాట తప్పారన్నారు. ఏడాదిన్నర క్రితం డీడీలు కట్టిన వారికి కాకుండా ఇటీవల కట్టిన వారికి ఇవ్వడం అన్యాయమన్నారు. విద్యుత్ శాఖ అధికారుల తీరుపై విచారణ జరిపి రైతులకు న్యాయం చేయాలని కోరారు. డీటీ సుబ్బరావుకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ స్టూడియో శ్రీనివాస్, జిల్లా ఆర్గనైజర్ సెక్రటరీ జయకుమార్, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ ముద్ధరాజు, రామకృష్ణప్ప, తాలూక బూత్ కమిటీ అధ్యక్షుడు, మల్లికార్జున్, నాయకులు, నాగరాజు, భోజే గౌడ్, లింగరాజు, పవన్, ఈరన్న, గురులింగ, శ్రీనివాసులు, తిమ్మరాయప్ప, హనుమంతు, రాజన్న, మైలరప్ప, మంజునాథ్, హనుమంతరాయ, మారుతి, శివన్న, రంగనాథ్, గంట నారాజు, నరసింహరాజు, గోవిందప్ప రైతులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ సమన్వయకర్త ఈరలక్కప్ప ధ్వజం


