మట్టికుప్పల్లో ఇరుక్కుపోయి వలస కార్మికుడి మృతి | - | Sakshi
Sakshi News home page

మట్టికుప్పల్లో ఇరుక్కుపోయి వలస కార్మికుడి మృతి

Aug 18 2026 7:28 AM | Updated on Aug 18 2026 7:28 AM

హిందూపురం: మట్టికుప్పల్లో ఇరుక్కుపోయి వలస కార్మికుడు మృతి చెందిన ఘటన మండలంలోని చెర్లోపల్లి వద్ద జరిగింది. వివరాలు.. చెర్లోపల్లి సమీపంలోని ఆదర్శ పాఠశాల వద్ద నూతన జాతీయ రహదారి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లా కొత్తకోటకు చెందిన అంజి (21) తన పెద్దమ్మ పెంటమ్మతో కలిసి ఇక్కడికి పనుల నిమిత్తం వచ్చాడు. ఆదివారం రాత్రి నుంచి అతను కనిపించకుండా పోయాడు. ఈ క్రమంలోనే సోమవారం రహదారి పనుల నిమిత్తం కుప్ప చేసిన మట్టిని జేసీబీతో లెవెల్‌ చేస్తుండగా, అంజి మృతదేహం బయటపడింది. మట్టిని కుప్పులు పోస్తున్న సమయంలో అందులో ఇరుక్కుపోయి మృతి చెంది ఉంటాడని తోటి కూలీలు తెలిపారు. అంజి మృతదేహం అతని పెద్దమ్మ పెంటమ్మ, తోటి కార్మికులు గుండెలవిసేలా రోదించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కార్మికులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు హిందూపురం రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement