కార్మికులు, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బీఎంఎస్ జిల్లా శాఖ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసింది. నేతలు మాట్లాడుతూ ఈఎస్‌ఐ వేతన పరిమితిని రూ.42 వేలకు, ఈపీఎస్ కనీస పెన్షన్‌ను రూ.7,500కు, ఈపీఎఫ్ వేతన పరిమితిని రూ.30 వేలకు పెంచాలని కోరారు. కనీస వేతనాన్ని రూ.30 వేలకు నిర్ణయించాలని, కాంట్రాక్ట్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. బ్యాంక్ ఉద్యోగులకు ఐదు రోజుల పనిదినాలు అమలు చేయాలని, గ్రాట్యుటీ పరిమితిని రూ.40 లక్షలకు పెంచాలని కోరారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులను క్రమబద్ధీకరించాలని కోరారు. కార్యక్రమంలో బీఎంఎస్ జిల్లా అధ్యక్షుడు మన్నె రాంబాబు, కార్యదర్శి సీహెచ్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.


