● రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
● బైక్ పైనుంచి పడి..
సోమశిల(ఆత్మకూరు): కుమారుడి పెళ్లి పత్రికలు బంధువులకు అందజేసేందుకు వెళ్తూ మోటార్‌బైక్‌పై నుంచి జారి పడి ఓ మహిళ మృతిచెందిన ఘటన అనంతసాగరం మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. నెల్లూరుకు చెందిన షేక్ శాన్వాజ్ (50) కుమారుడికి వచ్చే నెల 5వ తేదీ వివాహం నిశ్చయమైంది. పెళ్లి పత్రికలను అనంతసాగరం, సోమశిల గ్రామాల్లో ఉన్న బంధువులకు ఇచ్చేందుకు ఆమె బైక్‌పై వెనుకవైపు కూర్చొని వెళ్తుండగా మండలంలోని ముత్తుకూరు వద్ద జారిపడడంతో తలకు తీవ్ర గాయమైంది. 108 సిబ్బంది ఆత్మకూరులోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసు కేసు నమోదైంది.
కండలేరులో
22.55 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో ఆదివారం నాటికి 22.55 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు జలాశయం ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 2,000, లోలెవల్ కాలువకు 10, హైలెవల్ కాలువకు 90, పిన్నేరు కాలువకు 5, మొదటి బ్రాంచ్ కాలువకు 60 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.


