● భర్త ఆత్మహత్య
చిల్లకూరు: మద్యం తాగేందుకు భార్య నగదు ఇవ్వలేదని భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఓడూరు గ్రామ సమీపంలోని నిమ్మతోటలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. తోటపల్లిగూడూరు మండలం వరిగొండ గ్రామానికి చెందిన యాకసిరి విజయ్‌కుమార్ (26), భార్యతో కలిసి కొంతకాలంగా చిల్లకూరు మండలంలోని ఓడూరు గ్రామంలో మునిరెడ్డి అనే రైతు నిమ్మతోటలో పనికి కుదిరాడు. ఈ క్రమంలో గురువారం తన భార్యను మద్యం తాగేందుకు డబ్బు ఇవ్వాలని పట్టుబట్టడంతో ఆమె నిరాకరించింది. దీంతో తోటలో నిమ్మచెట్లకు తెచ్చిన పురుగు మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అతడిని గూడూరు చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
బెల్ట్ షాపులకు
వ్యతిరేకంగా నిరసన
చిల్లకూరు: కూటమి ప్రభుత్వం వీధికొక బెల్ట్ దుకాణం ఏర్పాటు చేసి సంసారాలు గుల్ల చేస్తోందని మోమిడికి చెందిన మహిళలు శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ గతంలో గ్రామంలో మద్యం బాటిల్ కనిపించేది కాదన్నారు. నేడు ఒక వీధిలో రెండు బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి విక్రయాలు చేస్తున్నారన్నారు. అనేకమంది తమ సంపాదనను మద్యంకే ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. దీంతో ఇళ్లు గడవడం కష్టతరంగా మారుతోందన్నారు. పలుమార్లు ఎకై ్సజ్ అధికారులకు ఫోన్లు చేసినా కనీసం తనిఖీలు కూడా చేపట్టడం లేదన్నారు. నిర్వాహకుల వద్దకు వెళ్లి విక్రయాలు ఆపేయాలని కోరితే మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అని బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోయారు.
నిమ్మ ధరలు (కిలో)
పెద్దవి : రూ.100
సన్నవి : రూ.50
పండ్లు : రూ.25


