చ‌రిత్ర సృష్టించిన వెస్టిండీస్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా | West Indies Break Record Of Highest Run Chase In T20Is Against India | Sakshi
Sakshi News home page

IND vs WI: చ‌రిత్ర సృష్టించిన వెస్టిండీస్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా

Oct 10 2026 7:47 AM | Updated on Oct 10 2026 7:50 AM

West Indies Break Record Of Highest Run Chase In T20Is Against India

PC: westindies cricket

రాంచీ వేదికగా టీమిండియాతో జరిగిన రెండో టీ20లో 6 వికెట్ల తేడాతో వెస్టిండీస్ సంచలన విజయం సాధించింది. ఆతిథ్య భారత్ నిర్దేశించిన 250 పరుగుల భారీ లక్ష్యాన్ని విండీస్ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.3 ఓవర్లలోనే ఊదిపడేసింది. కెప్టెన్ షాయ్ హోప్(45 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్లతో అద్భుత సెంచరీతో అజేయంగా నిలిచి మ్యాచ్‌ను ముగించాడు.

అతడితో పాటు రూథర్‌ఫోర్డ్‌(37 బంతుల్లో 84), రొమారియో షెపర్డ్(34) కీల‌క ఇన్నింగ్స్‌లు ఆడారు. అయితే  కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ 58 ప‌రుగుల‌కే 3 వికెట్లు కోల్పోయి పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది. ఈ స‌మ‌యంలో హోప్‌, రూథ‌ర్‌ఫోర్డ్ భార‌త బౌల‌ర్ల‌పై ఎదురు దాడికి దిగారు. రాంచీ మైదానంలో సిక్స‌ర్ల వ‌ర్షం కురిపించారు. 

టీమిండియా చెత్త ఫీల్డింగ్ కూడా వారికి క‌లిసిసొచ్చింది. రూథ‌ర్‌ఫోర్డ్ అవుటైన‌ప్ప‌టీ హోప్ మాత్రం ఏ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌లేదు. ఆరో స్ధానంలో బ్యాటింగ్‌కు వ‌చ్చిన షెప‌ర్డ్‌తో క‌లిసి జ‌ట్టును విజ‌య తీరాల‌కు చేర్చాడు. భార‌త బౌల‌ర్లు దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు. ఈ అద్భుత విజ‌యంతో వెస్టిండీస్ ప‌లు అరుదైన రికార్డుల‌ను తమ‌ పేరిట లిఖించుకుంది.

విండీస్ సాధించిన రికార్డులు ఇవే..
👉టీ20ల్లో టీమిండియాపై అత్య‌ధిక ల‌క్ష్యాన్ని చేధించిన జ‌ట్టుగా వెస్టిండీస్ చ‌రిత్ర సృష్టించింది. అంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది.  2023 నవంబర్‌లో భారత్‌పై  ఆస్ట్రేలియా 223 పరుగులు ఛేజ్ చేసింది. ఇప్పుడు ఆ రికార్డును విండీస్ బ్రేక్ చేసింది.

👉అదేవిధంగా టీ20 ఫార్మాట్‌లో విండీస్‌కు ఇదే అత్యధిక పరుగుల చేధన.  గతంలో 2015లో జోహన్నెస్‌బర్గ్‌లో సౌతాఫ్రికాపై ఛేదించిన త‌మ‌ 232 పరుగుల రికార్డును కరేబియన్ జట్టు దాటేసింది.


👉టీ20ల్లో ఇది రెండో అతి పెద్ద చేధ‌న కావ‌డం విశేషం. ఈ జాబితాలో సౌతాఫ్రికా అగ్ర‌స్ధానంలో ఉంది.  2023లో వెస్టిండీస్‌పై దక్షిణాఫ్రికా జట్టు 259 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.
చదవండి: వెస్టిండీస్‌ 'షై'నింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement