Virat Kohlis Net Worth Over Rs 1,000 Crore, Claims Report - Sakshi
Sakshi News home page

Virat Kohli: కోహ్లి సంపాదన ఎంతో తెలిస్తే షాక్‌!.. ఎవరికీ సాధ్యం కాని రీతిలో! ఎలా సంపాదిస్తున్నాడంటే?

Jun 18 2023 1:18 PM | Updated on Jun 18 2023 2:19 PM

Virat Kohlis Net Worth Over Rs 1000 Crore, Claims Report - Sakshi

ప్రపంచంలోనే అత్యంత పాపులర్‌ క్రీడాకారుల్లో టీమిండియా స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి ఒకడు. ఇన్‌స్టాగ్రామ్‌లో 252 మిలియన్లకు పైగా ఫాలోవర్లతో సోషల్ మీడియాలో అత్యధిక ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను కోహ్లి కలిగి ఉన్నాడు. మైదానంలో రికార్డులు కొల్లగొట్టే కింగ్‌ కోహ్లి.. సంపాదనలో కూడా అదరగొడుతున్నాడు. విరాట్‌ ప్రస్తుత సంవత్సర ఆదాయం ఎంతో తెలిస్తే నోరు వెళ్లబెట్టాల్సిందే.

స్టాక్ గ్రో రిపోర్ట్‌ ప్రకారం.. కోహ్లి నెట్‌వర్త్‌ విలువ 1,050 కోట్లు. ప్రస్తుత అంతర్జాతీయ క్రికెట్‌లో ఏ ఆటగాడు నెట్‌వర్త్‌ విలువ కూడా కోహ్లి అంత లేదు. కోహ్లి ఏయే రూపాలలో ఎంత అర్జిస్తున్నాడో ఓ లుక్కేద్దాం. అయితే విరాట్ కోహ్లి సంపాదనలో ప్రధాన భాగం తన సొంత వ్యాపార పెట్టుబడులు, ప్రచారకర్తగా చేసుకున్న ఒప్పందాల నుంచే వస్తోంది.

భారత క్రికెట్‌ నుంచి ఎంతంటే?
కోహ్లి ప్రస్తుతం బీసీసీఐ " ఏ ప్లస్‌" కాంట్రాక్ట్‌లో ఉన్నాడు. కాబట్టి ఏడాదికి రూ. 7 కోట్ల రూపాయలు టీమిండియా కాంట్రాక్ట్‌ రూపంలో లభిస్తోంది. అదే విధంగా అతడి మ్యాచ్‌ ఫీజుల విషయానికి వస్తే.. ప్రతీ టెస్టు మ్యాచ్‌కు రూ.15 లక్షలు, వన్డేకు రూ. 6 లక్షలు, టీ20 మ్యాచ్‌కు రూ.3 లక్షలు తీసుకుంటాడు.

ఐపీఎల్‌లో ఎంతంటే?
కోహ్లి ప్రస్తుతం ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అతడు ఆర్సీబీ నుంచి కాంట్రాక్ట్‌ రూపంలో ఏడాదికి రూ. 15 కోట్లు తీసుకుంటాడు.

ప్రచారకర్తగా ఎంత తీసుకుంటున్నాడంటే?
విరాట్‌ కోహ్లి వ్యాపార ప్రకటనల ద్వారా రోజు రూ.7.5 నుంచి 10 కోట్లు సంపాదిస్తున్నాడు.  కోహ్లి 18 బ్రాండ్స్‌ పైగా ప్రచారకర్తగా ఉన్నాడు.​వివో, మింత్రా, గ్రేట్ లర్నింగ్, నాయిస్, వ్రాగన్, బ్లూస్టార్, టూయమ్మీ, ఓలిని, లక్సర్, హెచ్‌ఎస్‌బీసీ, ఊబర్, టూత్సీ, స్టార్ స్పోర్ట్స్, అమెరికన్ టూరిస్టర్, ఎమ్‌ఆర్‌ఎప్, సింథాల్ సంస్థలకు కోహ్లి ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు.

సోషల్‌మీడియా ద్వారా ఎంతంటే?
సోషల్‌ మీడియాలో కూడా కోహ్లి బాగా సంపాదిస్తున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్టును షేర్‌ చేసినందుకు రూ.8.9 కోట్లు,  ట్విటర్‌లో రూ. 2.5 కోట్లు తీసుకుంటున్నాడు.



కోహ్లి బిజినెస్‌లు..
అదే విధంగా  బ్లూ ట్రైబ్, యూనివర్సల్ స్పోర్ట్స్‌బిజ్, ఏంపీఎల్‌, స్పోర్ట్స్ కాన్వో వంటి స్పోర్ట్స్ కాన్వో వంటి ఏడు స్టార్టప్‌ బిజినెస్‌లలో కోహ్లి పెట్టుబడి పెట్టాడు. అంతేకాకుండా కోహ్లికి ముంబైలో రెండు రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. ఫుట్‌బాల్ క్లబ్, టెన్నిస్ టీమ్, ప్రో రెజ్లింగ్ లీగ్‌ల్లో కూడా కోహ్లి భాగస్వామిగా ఉన్నాడు.

కోహ్లి అస్తుల విలువ ఎంతంటే?
ఇక కోహ్లి మొత్తం ప్రాపర్టీస్ విలువ రూ.110 కోట్లు. కోహ్లికి ముంబైలో రూ.34 కోట్లు విలువ చేసే ఇళ్లు ఉండగా.. గుర్‌గ్రామ్‌లో రూ.80 కోట్ల విలువ చేసే విల్లా ఉంది. అదే విధంగా కోహ్లి దగ్గర రూ.31 కోట్ల విలువైన కార్లు ఉన్నాయి. ఆడీ, రెంజ్‌రోవర్‌, ఫార్చూనర్ వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి.
చదవండి: Ashes 2023: క్యాచ్‌ విడిచిపెట్టారు.. స్టంపింగ్‌ మిస్‌ చేశారు! ఇంగ్లండ్‌ జట్టుపై మాజీ కెప్టెన్‌ ఫైర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement