England Great Nasser Hussain Slams Ben Stokes And Co - Sakshi
Sakshi News home page

Ashes 2023: క్యాచ్‌ విడిచిపెట్టారు.. స్టంపింగ్‌ మిస్‌ చేశారు! ఇంగ్లండ్‌ జట్టుపై మాజీ కెప్టెన్‌ ఫైర్‌

Published Sun, Jun 18 2023 12:14 PM

England Great Nasser Hussain  Slams Ben Stokes And Co - Sakshi

ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్‌ మధ్య జరుగుతున్న యాషెస్‌ తొలి టెస్టు రసవత్తరంగా మారింది. తొలి రోజు ఇంగ్లండ్‌ పైచేయి సాధించినప్పటికీ.. రెండో రోజు ఆస్ట్రేలియా కూడా ధీటుగా బదులుస్తోంది. ఇంగ్లండ్‌ తమ తొలి ఇన్నింగ్స్‌ను 393/8 స్కోర్‌ వద్ద డిక్లేర్‌ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం మొదటి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆస్ట్రేలియా తొలి సెషన్‌లోనే వార్నర్‌ (9), లబూషేన్‌ (0), స్టీవ్‌ స్మిత్‌ (16) వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఈ క్రమంలో ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖ్వాజా(126 నాటౌట్‌) అద్భుతమైన పోరాట పటిమ కనబరిచాడు. ఖ్వాజా వీరోచిత సెంచరీ సాధించాడు. దీంతో  ఆసీస్‌ రెండో రోజు ఆటముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది.

చెత్త ఫీల్డింగ్‌..
ఇక ఇది ఇలా ఉండగా.. రెండో రోజు చివరి సెషన్‌లో పేలవ ఫీల్డింగ్‌ ప్రదర్శన కనబరిచిన ఇంగ్లండ్‌ జట్టుపై ఆ దేశ మాజీ కెప్టెన్‌ నాజర్ హుస్సేన్ విమర్శలు వర్షం కురిపించాడు. ఆఖరి సెషనల్‌లో ఇంగ్లండ్‌ ఫీల్డర్లు బద్దకంగా కన్పించారు అని నాజర్ హుస్సేన్ విమర్శించాడు. కాగా ఆఖరి సెషన్‌లో ఖ్వాజా క్యాచ్‌ను విడిచిపెట్టగా.. క్యారీ స్టంపౌట్‌ రూపంలో అవకాశం ఇచ్చారు. అదే విధంగా రెండో రోజు ఆఖరిలో బ్రాడ్‌ బౌలింగ్‌లో ఖ్వాజా వికెట్‌ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. అయితే అది నోబాల్‌ కావడంతో మరోసారి ఖ్వాజా బతికిపోయాడు.

"ఎడ్జ్‌బాస్టన్ పిచ్‌ స్పిన్‌గా అద్భుతంగా అనుకూలిస్తోంది. ఇంగ్లీష్‌ స్పిన్నర్‌ మోయిన్‌ అలీ కూడా అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. కానీ చివరి సెషన్‌లో ఇంగ్లండ్‌ ఫీల్డర్లు అంత యాక్టివ్‌గా కనిపించలేదు. ఈజీ క్యాచ్‌ను విడిచిపెట్టడమే కాకుండా స్టంపౌట్‌ ఛాన్స్‌ను కూడా మిస్‌ చేశారు. నో బాల్‌ వికెట్‌ కూడా ఇంగ్లండ్‌కు చాలా ఖరీదుగా మారనుంది" అని స్కై స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హుస్సేన్ పేర్కొన్నాడు.
చదవండి: Ashes 2023: ఖ్వాజా వీరోచిత సెంచరీ.. బ్యాట్‌ కిందకు విసిరి! వీడియో వైరల్‌


 

Advertisement
Advertisement