Photo Credit: BCCI Twitter
ఉప్పల్ వేదికగా మరికొన్ని గంటల్లో భారత్, వెస్టిండీస్ మధ్య నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఇరుజట్లు ఉదయమే మైదానానికి చేరుకొని ముమ్మర సాధన చేశాయి. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా ఈ మ్యాచ్‌లోనూ గెలిచి మరో మ్యాచ్ ఉండగానే సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. మరోవైపు వెస్టిండీస్ మాత్రం మూడో టీ20లో విజయానికి చేరువగా వచ్చి ఓడిపోయినప్పటికీ, నేటి వన్డేలో మాత్రం ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా మ్యాచ్‌ను గెలిచి సిరీస్‌ను సమం చేయాలని చూస్తోంది.
ఈ నేపథ్యంలో నాలుగో టీ20కి టీమిండియా జట్టు ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగే అవకాశముంది. అభిషేక్ శర్మ సూపర్ ఫామ్‌లో ఉండడంతో పాటు ఐపీఎల్లో తన హొంగ్రౌండ్ కావడం అతడికి సానుకూలాంశం. ఇక మరో ఓపెనర్ సంజూ సామ్సన్ విఫలమవుతున్నప్పటికీ, ఉప్పల్ మైదానంలో అతడికి ఉన్న ట్రాక్ రికార్డు దృశ్యా అభిషేక్‌తో కలిసి మరోసారి ఓపెనింగ్ చేయనున్నాడు.
దీంతో ఈ మ్యాచ్‌కు కూడా వైభవ్ సూర్యవంశీ మరోసారి బెంచ్‌కే పరిమితం కానున్నాడు. వన్‌డౌన్‌లో ఇషాన్ కిషన్, నాలుగో స్థానంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మరోసారి కీలకం కానున్నారు. మ్యాచ్‌లో కళ్లన్నీ లోకల్ బాయ్ తిలక్ వర్మపైనే నెలకొన్నాయి. 73 అంతర్జాతీయ మ్యాచ్‌ల కెరీర్ తర్వాత తొలిసారి తన సొంతగడ్డపై భారత్ తరఫున బరిలోకి దిగుతున్న తిలక్‌వర్మపై అందరి దృష్టీ నిలిచింది.
గత టీ20లో అనూహ్యంగా రనౌటైన తిలక్ ఈసారి గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాలని పట్టుదలగా ఉన్నాడు. ఆల్రౌండర్లుగా అక్షర్‌పటేల్, నితీశ్‌కుమార్‌రెడ్డి, నమన్ ధీర్‌లు మంచి ఆటను కనబరుస్తున్నారు. బౌలింగ్ విభాగంలో అర్షదీప్ వైడ్లు ఎక్కువగా వేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్‌లు మరోసారి చెలరేగితే విండీస్‌కు కష్టాలు తప్పవనిపిస్తోంది.
నాలుగో టీ20కి భారత జట్టు అంచనా
అభిషేక్ శర్మ, సంజూ సామ్సన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, నితీశ్‌కుమార్ రెడ్డి, నమన్ ధీర్, అక్షర్ పటేల్, ప్రిన్స్ యాదవ్, అర్షదీప్ సింగ్, మయాంక్ యాదవ్.
ఇదీ చదవండి:


