Photo Credit: Twitter
ఉప్పల్ వేదికగా మరికొన్ని గంటల్లో భారత్, వెస్టిండీస్ మధ్య నాలుగో టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా వైస్‌కెప్టెన్ తిలక్ వర్మ తన సహచర ఆటగాళ్లకు హెచ్చరికలు జారీ చేశాడు. మ్యాచ్‌కు ముందు నిర్వహించే సంప్రదాయ ప్రెస్ కాన్ఫరెన్స్‌కు వైస్ కెప్టెన్ హోదాలో హాజరైన తిలక్ వర్మ విలేకరుల సమక్షంలో భారత జట్టు ఆటగాళ్లకు గంభీర్ ఇచ్చిన సందేశాన్ని వెల్లడించాడు.
తిలక్ వర్మ మాట్లాడుతూ.. ‘‘టీ20ల్లో వెస్టిండీస్ చాలా ప్రమాదకరమైన జట్టు. రెండుసార్లు టీ20ల్లో ప్రపంచ చాంపియన్లు అయిన విండీస్‌కు ఈ ఫార్మాట్లో ఆట ఎలా ఆడాలన్నది బాగా తెలుసు. అదే వారికున్న అద్భుతమైన బలం. మూడు మ్యాచ్‌లు ముగిసేసరికి మనం 2-1తో ఆధిక్యంలో ఉన్నప్పటికీ, తమదైన రోజున మ్యాచ్‌ను గెలిచే సత్తా వారికి ఉంది. అందుకే వాళ్లతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముంది.
రెండో టీ20లో ఓటమి తర్వాత భారత బౌలింగ్ విభాగం విమర్శలకు గురైంది. పవర్‌ప్లేలోనే వచ్చిన అవకాశాలను అద్భుతంగా సద్వినియోగం చేసుకున్న పర్యాటక జట్టు విజయాన్ని అందుకుంది. అందుకే మూడో టీ20కి ముందు మా రక్షణాత్మక విధానాన్ని సమీక్షించుకున్నామని, ప్రత్యర్థిని ఆధిపత్యం చెలాయించనివ్వకుండా మరింత దూకుడుగా ఆడి వికెట్ల కోసం ప్రయత్నించాలని హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ సలహా ఇచ్చారు.
అందుకే మూడో టీ20లో వాళ్లు విజయానికి చేరువైన క్రమంలో పదే పదే బౌలర్లను మార్చి ఫలితం సాధించాము. కొద్ది ఓవర్లలోనే మ్యాచ్ గమనాన్ని మార్చగల సత్తా ఉన్న ప్రత్యర్థిపై, ప్రణాళికలను మరింత మెరుగ్గా అమలు చేస్తూ, ఆ ప్రదర్శనను మరింత మెరుగుపరుచుకోవాలని మేము భావిస్తున్నాం’’ అని చెప్పుకొచ్చాడు.
ఇక వైస్ కెప్టెన్ హోదాలో తొలిసారి హోంగ్రౌండ్లో మ్యాచ్ ఆడుతుండడంపై తిలక్ వర్మ స్పందించాడు. "భారత జట్టు వైస్ కెప్టెన్‌గా హైదరాబాద్ ప్రేక్షకుల ముందు ఆడటం నాకు నిజంగా గర్వకారణం. ఇది నాకు ఒక ప్రత్యేకమైన క్షణం అవుతుంది,ష అని చెప్పుకొచ్చాడు. కాగా తిలక్ వర్మతో పాటు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీశ్‌కుమార్ రెడ్డి కూడా ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో భాగం కావడం వల్ల వీరికి కూడా సొంతగ్రౌండ్ కానుంది. మరి ఈ నలుగురు ఇవాళ ఎలా రాణిస్తారన్నది చూడాలి.
A special feeling at home, but a challenge to conquer! 🇮🇳 #TilakVarma opens up about the joy of playing in Hyderabad and how #TeamIndia is gearing up to embrace the challenge! 💪 Watch #INDvWI 4th T20I 👉 WED, OCT 14, 6 PM https://t.co/aqHw6HJwFx
— Star Sports (@StarSportsIndia) October 13, 2026
ఇదీ చదవండి:


