ఖయాస్ అహ్మద్, సెదీఖుల్లా అటల్ (PC: Twitter)
టెస్టు క్రికెట్లో కూడా ఉత్కంఠ పోరు అంటే ఏంటో ఏమిటో అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్ రుచి చూపించింది. మ్యాచ్ డ్రాగా ముగిసినప్పటికీ.. విజయం కోసం బంగ్లాదేశ్ చివరిదాకా ప్రయత్నించడం, అయితే అఫ్గానిస్తాన్ కూడా నిబ్బరం, ఏకాగ్రత కోల్పోకుండా ఆడి చిట్టచివరకు మ్యాచ్‌ను డ్రా చేసుకొని ఓటమి నుంచి బయటపడింది.
ముఖ్యంగా మరో ఓవర్‌తో చివరి రోజు ఆట ముగుస్తుందనగా.. మైదానంలో ఆటగాళ్ల మధ్య రేగిన ఉత్కంఠక్షణాలు అభిమానులను మునివేళ్లపై నిలబెట్టాయి. భారీ లక్ష్యం కళ్ల ముందున్నప్పటికీ, పోరాడితే పోయేదేం లేదన్నట్లుగా, ఒకవైపు వికెట్లు పడుతున్నా.. 142 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి అఫ్గానిస్తాన్ మ్యాచ్‌ను డ్రాగా ముగించింది.
ఈ నేపథ్యంలో ఆఫ్గన్ బ్యాటర్ ఖయాస్ అహ్మద్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచాడు. 80 బంతులాడిన ఖయాస్ 49 పరుగులతో అజేయంగా నిలిచి అఫ్గానిస్తాన్‌ను ఓటమి నుంచి గట్టెక్కించాడు. ఆఫ్గన్ల పోరాటం చూసిన తర్వాత ఈ టెస్టును డబ్ల్యూటీసీ లెక్కలోకి తీసుకొని ఉంటే డ్రా కారణంగా బంగ్లాదేశ్ పర్సంటేజీ పాయింట్లలో కోత పడేది. అప్పుడు టీమిండియా (51.52)కు నాలుగో స్థానానికి చేరుకునే అవకాశం ఉండేది.
ఇక అబుదాబి వేదికగా అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్ చారిత్రక డ్రాగా ముగిసింది. 479 పరుగుల టార్గెట్‌తో నాలుగో ఇన్నింగ్స్ ఆరంభించిన అఫ్గానిస్తాన్ చివరి రోజు ఆట ముగిసే సమయానికి 142 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 346 పరుగులు చేసింది.
ఓపెనర్ సెదీఖుల్లా అటల్ (111) సెంచరీతో మెరవగా, కెప్టెన్ రహమత్ షా (51) అర్థసెంచరీ సాధించగా, చివర్లో ఖయాస్ అహ్మద్ (49 నాటౌట్) బంగ్లా విజయాన్ని అడ్డుకున్నాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో ఎబాదత్ హొసెన్, మెహదీ హసన్‌లు చెరో 3 వికెట్లు తీశారు. అంతకముందు బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌ను 372-7 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. లిట్టన్ దాస్ (102) సెంచరీ చేశాడు. ఇక అఫ్గానిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 240 పరుగులకు ఆలౌట్ కాగా.. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 346 పరుగులకు ఆలౌటైంది.
LAST-OVER DRAMA! 🔥 A typical Qais Ahmad display under pressure as the #AfghanAtalan fight till the very end to secure a draw in the one-off Test against Bangladesh! 👏 #AFGvBD | #GloriousNationVictoriousTeam https://t.co/qDx11EEH5A
— Afghanistan Cricket Board (@ACBofficials) October 13, 2026
ఇదీ చదవండి:


