ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన వైభవ్‌ సూర్యవంశీ | Vaibhav Suryavanshi Creates History Breaks Unmukt Chand World Record For Most Sixes In Youth ODIs, Watch Video Goes Viral | Sakshi
Sakshi News home page

ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన వైభవ్‌ సూర్యవంశీ

Sep 24 2025 2:37 PM | Updated on Sep 24 2025 4:00 PM

Vaibhav Suryavanshi creates History Breaks Unmukt Chand world record

భారత యువ క్రికెటర్‌ వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) సరికొత్త చరిత్ర సృష్టించాడు. యూత్‌ వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా అవతరించాడు. ఈ క్రమంలో ఉన్ముక్త్‌ చాంద్‌ (Unmukt Chand) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును వైభవ్‌ సూర్యవంశీ బద్దలుకొట్టాడు.

ఆస్ట్రేలియా అండర్‌-19 జట్టుతో రెండో యూత్‌ వన్డే (IND U19 vs AUS U19) సందర్భంగా వైభవ్‌ సూర్యవంశీ ఈ ఘనత సాధించాడు. కాగా భారత అండర్‌-19 క్రికెట్‌ జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. ఇందులో భాగంగా మూడు మ్యాచ్‌ల యూత్‌ వన్డే సిరీస్‌లో ఆడుతోంది. ఈ క్రమంలో తొలి మ్యాచ్‌లో గెలిచి భారత్‌ 1-0తో ఆధిక్యం సంపాదించింది.

300 పరుగులు
ఈ క్రమంలో బుధవారం నాటి రెండో యూత్‌ వన్డేలోనూ భారత్‌ అదరగొట్టింది. 49.4 ఓవర్లలో 300 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. వైభవ్‌ సూర్యవంశీ (70), విహాన్‌ మల్హోత్రా (70), అభిగ్యాన్‌ కుందు (71) అద్భుత అర్థ శతకాల కారణంగా ఈ మేర భారీ స్కోరు సాధ్యమైంది.

 41వ సిక్స్‌
ఇక ఈ మ్యాచ్‌లో పద్నాలుగేళ్ల వైభవ్‌ 68 బంతుల్లో ఐదు ఫోర్లు, ఆరు సిక్సర్లు బాదాడు. ఈ క్రమంలో యూత్‌ వన్డేల్లో తన 41వ సిక్స్‌ను నమోదు చేశాడు. తద్వారా ఉన్ముక్త్‌ చాంద్‌ పేరిట ఉన్న వరల్డ్‌ రికార్డును బ్రేక్‌ చేసి.. అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా ఆల్‌టైమ్‌ రికార్డు నెలకొల్పాడు.

కాగా భారత్‌కు అండర్‌-19 వరల్డ్‌కప్‌ అందించిన కెప్టెన్‌ ఉన్ముక్త్‌ చాంద్‌. అయితే, టీమిండియాలో ఆడేందుకు అవకాశం రాకపోవడంతో అతడు అమెరికాకు వలస వెళ్లాడు. యూఎస్‌ఏ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌ ఆడుతున్నాడు. ఇక ఉన్ముక్త్‌ పేరు మీద భారత్‌ తరఫున ఉన్న ఈ ప్రపంచ రికార్డును చిచ్చరపిడుగు వైభవ్‌ తాజాగా బద్దలు కొట్టేశాడు.

 

యూత్‌ వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్లు
🏏వైభవ్‌ సూర్యవంశీ (ఇండియా)- 41 సిక్స్‌లు*- 2024-25
🏏ఉన్ముక్త్‌ చాంద్‌ (ఇండియా)- 38 సిక్స్‌లు- 2011-12
🏏జవాద్‌ అబ్రార్‌ (బంగ్లాదేశ్‌)- 35 సిక్స్‌లు- 2025-25
🏏షాజైబ్‌ ఖాన్‌ (పాకిస్తాన్‌)- 31 సిక్స్‌లు- 2022-24
🏏యశస్వి జైస్వాల్‌ (ఇండియా)- 30 సిక్స్‌లు- 2018-20.

యూత్‌ క్రికెట్‌లో వైభవ్‌ సూర్యవంశీ సాధించిన అరుదైన రికార్డులు
🏏యూత్‌ వన్డేల్లో 52 బంతుల్లోనే శతకం
🏏యూత్‌ వన్డేల్లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు (10) బాదిన ఇండియన్‌ బ్యాటర్‌
🏏170 ఏళ్ల క్రికెట్‌ చరిత్రలో 13 ఏళ్ల 188 రోజుల వయసులోనే సెంచరీ (కాంపిటేటివ్‌ క్రికెట్‌) బాదిన ఆటగాడిగా ఘనత
🏏రంజీ ట్రోఫీలో 12 ఏళ్ల 284 రోజుల వయసులోనే అడుగుపెట్టిన ఆటగాడిగా రికార్డు
🏏ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీ (35 బంతుల్లో) చేసిన అత్యంత పిన్న వయస్కుడు
🏏యూత్‌ టెస్టుల్లో ఫాస్టెస్ట్‌ సెంచరీ (58 బంతుల్లో) చేసిన భారత ఆటగాడు.

చదవండి: IND vs AUS: ఆసీస్‌ భారీ స్కోరు.. కేఎల్‌ రాహుల్‌ ఫెయిల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement