ఐపీఎల్-2026లో వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో కీలక మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ నిరాశపరిచాడు. 6 బంతుల్లో కేవలం 4 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. అయితే ఈ మ్యాచ్‌లో వైభవ్ త్వరగా అవుట్ అయినప్పటికి ఓ వరల్డ్ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
ఒక టీ20 సిరీస్ లేదా టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన పిన్న వయష్కుడిగా 15 ఏళ్ల వైభవ్ నిలిచాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో సూర్యవంశీ ఇప్పటివరకు 14 మ్యాచ్‌లు ఆడి 583 పరుగులు చేశాడు. 4 పరుగులు వ్యక్తిగత స్కోర్ వద్ద వైభవ్ ఈ ఫీట్ సాధించాడు.
ఇంతకుముందు ఈ రికార్డు ఆర్సీబీ స్టార్ దేవ్‌దత్త్ పడిక్కల్ పేరిట ఉండేది. 2019/20 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పడిక్కల్ కర్ణాటక తరఫున 580 పరుగులు చేశాడు. పడిక్కల్ 19 ఏళ్ల వయస్సులో ఈ ఘనత సాధించాడు. తాజాగా ఇన్నింగ్స్‌తో పడిక్కల్ ఆల్‌టైమ్ రికార్డును వైభవ్ బ్రేక్ చేశాడు.
ఇక ఈ డూ ఆర్‌డై మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోరు సాధించింది. యశస్వి జైస్వాల్ (27), ధ్రువ్ జురెల్ (38), దసున్ శనక (28), జోఫ్రా ఆర్చర్ (32) పరుగులతో రాణించారు. అనంతరం లక్ష్య చేధనలో ముంబై పోరాడుతోంది.
చదవండి: మోసగాడు.. వచ్చాడు 18 కోట్లు పట్టుకెళ్లాడు!'


