మహిళా క్రికెటర్లకు వేధింపులు.. టీసీఏ ఆగ్రహం | Telangana Cricket Association Warns-Chamundeshwara-Nath-About-Women Cricketers | Sakshi
Sakshi News home page

మహిళా క్రికెటర్లకు వేధింపులు.. టీసీఏ ఆగ్రహం

Jun 27 2026 9:21 PM | Updated on Jun 27 2026 9:27 PM

Telangana Cricket Association Warns-Chamundeshwara-Nath-About-Women Cricketers

హైదరాబాద్‌: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు చాముండేశ్వరీనాథ్‌కు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) హెచ్చరికలు జారీ చేసింది. టీసీఏ అనుబంధ మహిళా క్రికెటర్లను సంప్రదించడం, వారిపై లైంగిక వేధింపులు వంటి చర్యలను విరమించుకోవాలని పేర్కొంది. తమ అంతర్గత వ్యవహారాల్లో ఇలాంటి జోక్యాలను సహించేది లేదని, దీనివల్ల చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తోందని టీసీఏ స్పష్టం చేసింది. 

ఈ మేరకు టీసీఏ ప్రధాన కార్యదర్శి ధరమ్ గురువారెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. చాముండేశ్వరినాథ్ తమను సంప్రదిస్తున్నట్లు తెలంగాణ మహిళా క్రికెటర్ల నుంచి అసోసియేషన్‌కు పలు ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈ ఫిర్యాదులకు సంబంధించిన టెలిఫోన్ కాల్ రికార్డులను, వాట్సాప్ చాట్‌లు అసోసియేషన్ వద్ద ఉన్నాయని తెలిపారు. కాబట్టి చాముండేశ్వరీనాథ్ ఇలాంటి కార్యకలాపాలకు దూరంగా ఉండాలని స్నేహపూర్వకంగా కోరుతున్నామన్నారు. 

అలా కాదని టీసీఏ ఆటగాళ్లతో సంప్రదింపులు చేస్తూ తమ పనితీరులో జోక్యం చేసుకుంటే మాత్రం, చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని గురువారెడ్డి తెలిపారు. తమ ఆటగాళ్ల భద్రత, ఆత్మవిశ్వాసం, సంక్షేమమే తమకు ప్రాధాన్యత అని, ఆటగాళ్ల రక్షణకు తాము కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. మహిళా ఆటగాళ్లు ఎలాంటి వేధింపులకు లేదా బెదిరింపులకు గురైనట్లు భావిస్తే మాత్రం చట్టప్రకారం పోలీసులను ఆశ్రయించి  న్యాయపరమైన రక్షణ పొందే పూర్తి హక్కు బాధిత ఆటగాళ్లకు ఉంటుందని తెలిపారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement