T20 World Cup 2024: పాక్‌ పేసర్ల విజృంభణ.. కుప్పకూలిన టీమిండియా | T20 World Cup 2024: Pakistan Restricted Team India For 119 Runs | Sakshi
Sakshi News home page

T20 World Cup 2024: పాక్‌ పేసర్ల విజృంభణ.. కుప్పకూలిన టీమిండియా

Jun 9 2024 11:15 PM | Updated on Jun 9 2024 11:15 PM

T20 World Cup 2024: Pakistan Restricted Team India For 119 Runs

టీ20 వరల్డ్‌కప్‌ 2024లో భాగంగా న్యూయార్క్‌ వేదికగా పాకిస్తాన్‌తో ఇవాళ (జూన్‌ 9) జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు చేతులెత్తేశారు. వరుణుడి అంతరాయాల నడుమ సాగుతున్న ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. పాక్‌ పేసర్ల ధాటికి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌.. నిర్ణీత ఓవర్లు కూడా ఆడకుండానే 19 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌటైంది. 

పాక్‌ బౌలర్లలో నసీం షా, హరీస్‌ రౌఫ్‌ తలో 3 వికెట్లు, మొహమ్మద్‌ ఆమిర్‌ 2, షాహిన్‌ అఫ్రిది ఓ వికెట్‌ పడగొట్టి టీమిండియా పతనాన్ని శాశించారు. భారత ఇన్నింగ్స్‌లో రిషబ్‌ పంత్‌ (31 బంతుల్లో 42; 6 ఫోర్లు) మినహా అందరూ దారుణంగా విఫలమయ్యారు.  రోహిత్‌ శర్మ (12 బంతుల్లో 12; ఫోర్‌, సిక్స్‌), అక్షర్‌ పటేల్‌ (18 బంతుల్లో 20; 2 ఫోర్లు, సిక్స్‌) రెండంకెల స్కోర్‌ చేయగలిగారు. 

విరాట్‌ కోహ్లి (3 బంతుల్లో 4; ఫోర్‌),  సూర్యకుమార్‌ యాదవ్‌ (8 బంతుల్లో 7; ఫోర్‌), శివమ్‌ దూబే (9 బంతుల్లో 3), హార్దిక్‌ పాండ్యా (12 బంతుల్లో 12; ఫోర్‌), రవీంద్ర జడేజా (0), అర్ష్‌దీప్‌ సింగ్‌ (13 బంతుల్లో 9; ఫోర్‌), బుమ్రా (0) సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు.

తుది జట్లు..

భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్‌), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్‌కీపర్‌), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్

పాకిస్తాన్: మహ్మద్ రిజ్వాన్(వికెట్‌కీపర్‌), బాబర్ ఆజం(కెప్టెన్‌), ఉస్మాన్ ఖాన్, ఫఖర్ జమాన్, షాదాబ్ ఖాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఇమాద్ వసీం, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్, నసీమ్ షా, మహ్మద్ అమీర్

Advertisement
 
Advertisement
Advertisement