నరైన్‌ మరో చారిత్రక ఘనత | Sunil Narine Beats Dwayne Bravo To Claim Historic T20 Bowling Feat, Check Out Full Details About This Record | Sakshi
Sakshi News home page

నరైన్‌ మరో చారిత్రక ఘనత

Jun 22 2026 11:09 AM | Updated on Jun 22 2026 12:06 PM

Sunil Narine Beats Dwayne Bravo To Claim Historic T20 Bowling Feat

విండీస్‌ స్పిన్‌ మాంత్రికుడు సునీల్‌ నరైన్‌ పొట్టి క్రికెట్‌లో మరో చారిత్రక ఘనత సాధించాడు. మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ 2026లో లాస్‌ ఏంజెలెస్‌ నైట్‌ రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు.. నిన్న సియాటిల్‌ ఓర్కాస్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు కీలక వికెట్లు తీయడంతో టీ20 క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానానికి (632 వికెట్లతో) ఎగబాకాడు. 

ఈ క్రమంలో తన మాజీ సహచరుడు డ్వేన్‌ బ్రావోను (631) అధిగమించాడు. ఈ జాబితాలో ఆఫ్ఘనిస్తాన్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ (723) టాప్‌ ప్లేస్‌లో ఉన్నాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. నరైన్‌తో పాటు (4-0-18-2), రసెల్‌ (1.3-0-8-3), వాన్‌ ష్కాల్విక్‌ (3-0-17-3), లీ రాక్స్‌ (2-0-17-2) చెలరేగడంతో ఓర్కాస్‌పై నైట్‌రైడర్స్‌ 81 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన నైట్‌ రైడర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 196 పరుగులకు ఆలౌటైంది. 

ఆండ్రీ ఫ్లెచర్‌ (40), కొలిన్‌ మున్రో (30), రోవ్‌మన్‌ పావెల్‌ (37), హోల్డర్‌ (23) ఓ మోస్తరు స్కోర్లతో రాణించారు. ఓర్కాస్‌ బౌలర్లలో జస్దీప్‌ సింగ్‌, బార్ట్‌మన్‌ తలో 3 వికెట్లు పడగొట్టగా.. షనక 2, అలీ షేక్‌, హర్మీత్‌ సింగ్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.

197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఓర్కాస్‌ పూర్తిగా విఫలమైంది. నరైన్‌, రసెల్‌, ష్కాల్విక్‌, లీ రాక్స్‌ ధాటి​ఇ 15.3 ఓవర్లలో కేవలం 115 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టు తరఫున బ్యాటింగ్‌లో ఒక్కరు కూడా రాణించలేదు.

బౌలింగ్‌లో నరైన్‌తో పాటు షాడ్లీ వాన్‌ షాల్క్‌విక్‌, ఆండ్రే రస్సెల్‌ తలో మూడు వికెట్లు తీసి జట్టు విజయాన్ని ఖాయం చేశారు. చివరికి లాస్‌ ఏంజెలెస్‌ నైట్‌ రైడర్స్‌ 81 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. 

25 పరుగులు చేసిన ఎనిమిదో నంబర్‌ ఆటగాడు హర్మీత్‌ సింగ్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. విధ్వంసకర బ్యాటర్లు టిమ్‌ సీఫర్ట్‌ 5, హెట్‌మైర్‌ 11, స్టోయినిస్‌ 1, షనక​ 14 పరుగుల​కు ఔటయ్యారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement