న్యూఢిల్లీ: హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్ అనిరుధ్ చంద్రశేఖర్ ఈ ఏడాది రెండో ఏటీపీ చాలెంజర్ టూర్ డబుల్స్ టైటిల్ సాధించాడు. భారత్‌కే చెందిన డేవిస్‌కప్ జట్టు సభ్యుడు శ్రీరామ్ బాలాజీతో జతకట్టిన అనిరుధ్ మెక్సికోలో జరిగిన క్యాన్‌కన్ కంట్రీ ఓపెన్ ఏటీపీ చాలెంజర్–125 టోర్నీలో విజేతగా నిలిచాడు.
84 నిమిషాలపాటు జరిగిన పురుషుల డబుల్స్ తుది పోరులో అనిరు«ద్–శ్రీరామ్ బాలాజీ ద్వయం 6–3, 7–6 (7/4)తో లియుటారెవిచ్ (బెలారస్)–వరేలా (మెక్సికో) జంటపై నెగ్గింది. అనిరు«ద్–బాలాజీ జంటకు 9,900 డాలర్ల (రూ. 9 లక్షల 48 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 125 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ ఏడాది అనిరుధ్ జపాన్ ప్లేయర్ టకెరు యుజికితో కలిసి బుసాన్ ఓపెన్ టోర్నీలో టైటిల్ సాధించాడు. తాజా టైటిల్‌తో ఏటీపీ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో అనిరుధ్ 6 స్థానాలు ఎగబాకి 86వ ర్యాంక్‌కు చేరుకున్నాడు.


