మంధాన మెరుపులు.. నెద‌ర్లాండ్స్ ముందు భారీ స్కోర్‌ | Smriti Mandhanas Top-Notch Puts India On Course For 200 Plus Total | Sakshi
Sakshi News home page

T20 WC 2026: మంధాన మెరుపులు.. నెద‌ర్లాండ్స్ ముందు భారీ స్కోర్‌

Jun 17 2026 8:42 PM | Updated on Jun 17 2026 8:56 PM

Smriti Mandhanas Top-Notch Puts India On Course For 200 Plus Total

మహిళల టీ20 ప్రపంచకప్‌-2026లో భాగంగా లీడ్స్ వేదికగా నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత బ్యాటర్లు సత్తాచాటారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోర్  సాధించింది. స్మృతి కేవలం 47 బంతుల్లోనే 11 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 74 పరుగులు చేసి భారత తరపున టాప్‌ స్కోరర్‌గా నిలిచింది.

ఆఖరిలో రిచా ఘోష్‌(8 బంతుల్లో 20) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడింది. భారత్‌కు ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మలు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 116 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 

షెఫాలీ(55) హాఫ్ సెంచరీ చేశాక ఔటైనప్పటికి, మంధాన మాత్రం తన దూకుడును కొనసాగించింది. డచ్‌ బౌలర్లలో కరోలిన్ డి లాంగే రెండు వికెట్లు పడగొట్టగా.. హీథర్‌, మిర్తే వాన్ డెన్ రాడ్ తలా వికెట్‌ సాధించారు.
చదవండి: 77 పరుగులకే ఖేల్‌ ఖతం.. 9.3 ఓవర్లలో ఛేదన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement