సెరెనాకు నిరాశ | Serena Williams lost a fight to the hands of Maya Joint | Sakshi
Sakshi News home page

సెరెనాకు నిరాశ

Jul 2 2026 4:03 AM | Updated on Jul 2 2026 4:03 AM

Serena Williams lost a fight to the hands of Maya Joint

లండన్‌: వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌ విభాగంలో ఏడుసార్లు విజేత, అమెరికా దిగ్గజ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్‌కు నిరాశ ఎదురైంది. నాలుగేళ్ల తర్వాత మళ్లీ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఆడుతోన్న 44 ఏళ్ల సెరెనా తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది. 2 గంటల 22 నిమిషాలపాటు జరిగిన తొలి రౌండ్‌లో సెరెనా 3–6, 7–6 (8/6), 3–6తో మాయా జాయింట్‌ (ఆ్రస్టేలియా) చేతిలో పోరాడి ఓడిపోయింది. 2021, 2022లలో కూడా ఈ టోర్నీలో తొలి రౌండ్‌లోనే వెనుదిరిగిన సెరెనా ఆ తర్వాత నాలుగేళ్లు ఆటకు దూరమైంది. 

తన సోదరి వీనస్‌ విలియమ్స్‌తో కలిసి సెరెనా ఈసారి డబుల్స్‌ విభాగంలో పోటీపడనుంది. మరోవైపు మహిళల సింగిల్స్‌ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్‌ సబలెంకా (బెలారూస్‌), మూడో సీడ్‌ కోకో గాఫ్‌ (అమెరికా), నాలుగో సీడ్‌ జెస్సికా పెగూలా (అమెరికా), 14వ సీడ్‌ నయోమి ఒసాకా (జపాన్‌) రెండో రౌండ్‌ మ్యాచ్‌ల్లో గెలిచి మూడో రౌండ్‌లోకి అడుగు పెట్టారు. పురుషుల సింగిల్స్‌ విభాగంలో డిఫెండింగ్‌ చాంపియన్‌ యానిక్‌ సినెర్‌ (ఇటలీ), ఎనిమిదో సీడ్‌ మెద్వెదెవ్‌ (రష్యా), తొమ్మిదో సీడ్‌ ఫ్లావియో కొబోలి (ఇటలీ) మూడో రౌండ్‌లోకి ప్రవేశించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement