భారత స్టార్ క్రికెటర్లు తిలక్ వర్మ, మహ్మద్ సిరాజ్‌లకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) లీగల్ నోటీసులు జారీ చేసింది. బీసీసీఐ నుంచి అనుమతి లేకుండానే హెచ్‌సీఏ నిర్వహిస్తున్న టీజీ 20 లీగ్‌కు ప్రచారం చేయడాన్ని తప్పుబడుతూ నోటీసులు జారీ చేసినట్లు టీసీఏ జనరల్ సెక్రటరీ గురవారెడ్డి తెలిపారు.
కాగా వీరిద్దరితో పాటు టీజీ 20 లీగ్ ఆపరేషన్స్ హెడ్, మాజీ క్రికెటర్ అంబటి రాయుడు సహా ప్రచార కర్తలుగా ఉన్న సినీ హీరోలు విజయ్ దేవరకొండ, వెంకటేశ్ దగ్గుబాటిలకు కూడా నోటీసులు జారీ చేసినట్లు టీసీఏ తెలిపింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి అనుమతి లేని టీజీ20కి ప్రచారం చేయడం అక్రమమని పేర్కొన్న టీసీఏ చర్యలకు ఉపక్రమించింది.
టీసీఏ ఆరోపణల ప్రకారం బీసీసీఐ అనుమతి లేకుండానే హెచ్‌సీఏ టీజీ 20 లీగ్‌ను నిర్వహిస్తున్నట్లు తమకు సమాచారం అందింది. అందుకే టీజీ20 లీగ్‌కు ఆడనున్న క్రికెటర్లతో పాటు ప్రచారకర్తలుగా హీరోలకు, లీగ్ ఆపరేషన్స్ హెడ్ అంబటి రాయుడుకు కూడా లీగల్ నోటీసులు అందించినట్లు టీసీఏ పేర్కొంది.
హెచ్‌సీఏ ఆధ్వర్యంలో టీ20 తరహాలో టీజీ20 క్రికెట్ లీగకు శ్రీకారం చుట్టారు. ఈ టోర్నీలో 8 క్రికెట్ జట్లను ఏర్పాటు చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, మెదక్, నల్గొండ, కరీంనగర్, మహబూబ్నగర్, ఖమ్మం జట్లున్నాయి. జూన్ 20 నుంచి ప్రారంభం కానున్న టోర్నీ జులై 11న ఫైనల్‌తో ముగియనుంది.
Read: కెనడా ప్లేయర్‌కు విరిగిన కాలు; కట్‌చేస్తే ఖతార్‌కు చుక్కలు!


