కొంప‌ముంచిన రెడ్‌కార్డ్‌.. బెల్జియంకు ఇరాన్ షాక్‌ | Red Card For-Belgium Star-Match Drawn-With-Iran-FIFA WC 2026 | Sakshi
Sakshi News home page

కొంప‌ముంచిన రెడ్‌కార్డ్‌.. బెల్జియంకు ఇరాన్ షాక్‌

Jun 22 2026 10:47 AM | Updated on Jun 22 2026 11:19 AM

Red Card For-Belgium Star-Match Drawn-With-Iran-FIFA WC 2026

ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌లో ఇరాన్‌, బెల్జియం మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఫిఫాలో 9వ ర్యాంక్‌లో ఉన్న బెల్జియం టోర్నీలో ఇంకా బోణీ చేయలేదు. అయితే బెల్జియం ఆట‌గాడు నాథ‌న్ ఎంగోయ్ గోల్ ఆట 67వ నిమిషంలో గోల్ కొట్టిన‌ప్ప‌టికీ రెడ్‌కార్డ్ అత‌డి కొంప‌ముంచింది. రిఫ‌రీ చూస్తుండ‌గానే ఎంగోయ్ బంతిని త‌న చేతుల‌తో వెనుక వైపు నుంచి పాస్ అందించే ప్ర‌య‌త్నం చేశాడు. 

ఈ క్ర‌మంలో గోల్ కొట్టేందుకు వ‌చ్చిన ఇరాన్ ఫార్వార్డ్ ప్లేయ‌ర్ మెహ్దీ త‌రేమీని ఉద్దేశ‌పూర్వ‌కంగా కింద ప‌డేశాడు. దీంతో ఇరాన్‌కు గోల్ వ‌చ్చే చాన్స్ మిస్స‌యింది. దీంతో రిఫ‌రీ నాథ‌న్ ఎంగోయ్‌కు రెడ్‌కార్డ్ చూపించ‌డంతో మైదానం వీడాడు. నాథ‌న్ ఎంగోయ్ కొట్టిన గోల్ కూడా చెల్ల‌లేదు. ఆ త‌ర్వాత బెల్జియం ప‌లుమార్లు గోల్ పోస్టుల‌పై దాడి చేసిన‌ప్ప‌టికీ ఇరాన్ గోల్ కీప‌ర్ అలీరెజా బెయిరాన్‌వాండ్ స‌మ‌ర్థంగా అడ్డుకొని ఇరాన్ మ్యాచ్ డ్రా చేసుకోవ‌డంలో కీల‌క‌పాత్ర పోషించాడు.

వరుసగా రెండు మ్యాచ్‌లు డ్రా చేసుకోవడంతో బెల్జియం నాకౌట్ దశకు అర్హత సాధించడం అనుమానమే. ఎందుకంటే బెల్జియం కంటే ముందు ఈజిప్ట్‌, ఇరాన్‌లు ఉన్నాయి. న్యూజిలాండ్‌పై గెలుపుతో ఈజిప్ట్ 4 పాయింట్లతో తొలి స్థానంలో కొనసాగుతుంది. ఒకవేళ ఈజిప్ట్ తన చివరి మ్యాచ్ గెలవడం లేదా  డ్రా చేసుకుంటే మాత్రం బెల్జియం ఇంటిబాట పట్టాల్సిందే. ఇక బెల్జియం తన చివరి మ్యాచ్‌ను న్యూజిలాండ్‌తో ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో బెల్జియం భారీ తేడాతో గెలిస్తేనే నాకౌట్ దశకు చేరుకునే అవకాశం ఉంటుంది.

Read: 33 మ్యాచ్‌ల్లో వంద గోల్స్‌.. ఆల్‌టైమ్ రికార్డు ఎంతో తెలుసా?

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement