టీమిండియా ఆటగాళ్లకు తప్పిన పెను ప్రమాదం! | Prabhsimran Singh, Nishant Sindhu Get In Nasty Collision On The Field | Sakshi
Sakshi News home page

IND vs AUS: టీమిండియా ఆటగాళ్లకు తప్పిన పెను ప్రమాదం!

Oct 6 2026 4:40 PM | Updated on Oct 6 2026 4:53 PM

Prabhsimran Singh, Nishant Sindhu Get In Nasty Collision On The Field

PC: X

పుదుచ్చేరి వేదికగా భారత్‌-ఎ, ఆస్ట్రేలియా-ఎ జట్ల మధ్య జరుగుతున్న తొలి అనధికారిక వన్డే మ్యాచ్‌లో ఓ అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. టీమిండియా ఆటగాళ్లు ప్రభ్‌సిమ్రాన్ సింగ్, నిషాంత్ సింధు మైదానంలో పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు.

ఏం జరిగిందంటే?
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో యష్ ఠాకూర్ వేసిన షార్ట్ బాల్‌ను ఆసీస్ ఓపెనర్ మిచెల్ ఓవెన్ పుల్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే టైమింగ్ కుదరకపోవడంతో బంతి గాల్లోకి లేచి కవర్-పాయింట్ దిశగా వెళ్లింది. ఆ క్యాచ్ పట్టేందుకు వికెట్ కీపర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చాడు.

ప్రభ్‌సిమ్రాన్ క్యాచ్ కోసం కాల్ ఇచ్చినప్పటికీ, కవర్-పాయింట్ నుంచి నిషాంత్ సింధు కూడా వేగంగా ముందుకు పరిగెత్తాడు. ఈ క్రమంలో ఇద్దరూ ఒకరినొకరు బలంగా ఢీకొని కిందపడిపోయారు. అయినప్పటికీ ప్రభ్‌సిమ్రాన్ బంతిని చేజారనివ్వకుండా పట్టుకుని ఓవెన్ (10 పరుగులు)ను పెవిలియన్‌‌కు పంపాడు.

ఢీకొన్న తీవ్రత చూసి ఆటగాళ్లకు ఏమైనా గాయాలవుతాయేమోనని అందరూ కంగారు పడ్డాడు. కానీ ఇద్దరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో సహచర ఆటగాళ్లతో పాటు అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement