హడలెత్తించిన హెన్రీ | New Zealand seal emphatic 253-run win to level three-match series at 1-1 | Sakshi
Sakshi News home page

హడలెత్తించిన హెన్రీ

Jun 22 2026 6:14 AM | Updated on Jun 22 2026 6:14 AM

New Zealand seal emphatic 253-run win to level three-match series at 1-1

లండన్‌: ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో ఘోర పరాజయం ఎదుర్కొన్న న్యూజిలాండ్‌... రెండో టెస్టులో ఘనవిజయంతో సిరీస్‌ను 1–1తో సమం చేసింది. ఆదివారం ముగిసిన రెండో టెస్టులో న్యూజిలాండ్‌ 253 పరుగుల తేడాతో నెగ్గింది. 463 పరుగుల లక్ష్యఛేదనలో ఓవర్‌నైట్‌ స్కోరు 182/5తో చివరి రోజు రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన  ఇంగ్లండ్‌ 58.1 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది. 

జో రూట్‌ (145 బంతుల్లో 77; 8 ఫోర్లు) పోరాడాడు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ మ్యాట్‌ హెన్రీ 29 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 391 పరుగులు చేయగా... ఇంగ్లండ్‌ 291 పరుగులకు పరిమితమైంది. న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 362 పరుగులు చేసి ప్రత్యర్థి ముందు కొండంత లక్ష్యాన్ని నిలిపింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement