మెస్సీ ఖాతాలో అత్యధిక గోల్స్‌.. గంటల వ్యవధిలో ఎంబాపెకు చెక్‌! | Lionel Messi Top Scorer Ever In FIFA World Cup History Joint Miro Klose At Top With 16 Goals In History | Sakshi
Sakshi News home page

మెస్సీ ఖాతాలో అత్యధిక గోల్స్‌.. గంటల వ్యవధిలో ఎంబాపెకు చెక్‌!

Jun 17 2026 9:23 AM | Updated on Jun 17 2026 11:44 AM

Lionel Messi-Top-Scorer Ever In FIFA-World Cup History Joint-Miro Klose

అర్జెంటీనా స్టార్ ఆట‌గాడు లియోనల్ మెస్సీకి రికార్డులు కొత్తేమి కాదు. ఇప్ప‌టికే ఎన్నో రికార్డుల‌ను త‌న పేరిట లిఖించుకున్న మెస్సీకి ఒక్క రికార్డు మాత్రం చాన్నాళ్లుగా ఊరిస్తూ వ‌చ్చింది. ఫిఫా చ‌రిత్ర‌లో అత్య‌ధిక గోల్స్ కొట్టిన ఆట‌గాళ్ల జాబితాలో త‌న పేరును అగ్ర‌స్థానంలో చూసుకోవాల‌ని మెస్సీ త‌హ‌త‌హ‌లాడాడు. ఆరోజు రానే వ‌చ్చింది. 

రికార్డు స్థాయిలో ఆరో ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ ఆడుతున్న మెస్సీ అల్జీరియాతో ఆరంభ మ్యాచ్‌లోనే ఆ రికార్డును అందుకున్నాడు. అల్జీరియాతో మ్యాచ్‌లో హ్యాట్రిక్ గోల్స్‌తో మెరిసి ఒక రాత్రిలోనే త‌నకంటే ఎక్కువ గోల్స్‌తో ఉన్న ఎంబాపె, ముల్ల‌ర్‌, రొనాల్డోల‌ను దాటుకొని ఇవాళ జ‌ర్మ‌నీ దిగ్గ‌జం మిరాస్లావ్ క్లోజ్‌తో క‌లిసి సంయుక్తంగా అగ్ర‌స్థానంలో నిలిచాడు. ఇక ఫిఫా చ‌రిత్ర‌లో అత్య‌ధిక గోల్స్ కొట్టిన ఆట‌గాడిగా నిలిచేందుకు ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు లియోన‌ల్ మెస్సీ.

పిఫా ప్ర‌పంచ‌క‌ప్ 2026లో మెస్సీ త‌న ఆట‌ను మొద‌లెట్టేశాడు. అల్జీరియా చిన్న జ‌ట్టు అయిన‌ప్ప‌టికీ గ‌త ఫిఫాలో సౌదీ అరేబియా చేతిలో ఎదురైన ప‌రాభ‌వాన్ని మ‌దిలో పెట్టుకున్న మెస్సీ ఈసారి ఆ తప్పు చేయొద్దని భావించాడు. అందుకే ఆరంభం నుంచే ప్ర‌త్య‌ర్థి గోల్‌పోస్టుపై అదే ప‌నిగా దాడులు చేశాడు. ఈ క్ర‌మంలోనే మ్యాచ్‌లో హ్యాట్రిక్ గోల్స్ కొట్టి అరుదైన రికార్డు సాధించాడు. 

ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్పుల్లో మెస్సీకి ఇది 16వ గోల్ కావ‌డం విశేషం. త‌ద్వారా ఫిఫా చ‌రిత్ర‌లో అత్య‌ధిక గోల్స్ కొట్టిన ఆట‌గాళ్ల జాబితాలో మెస్సీ జ‌ర్మ‌నీ దిగ్గ‌జం మిరోస్లావ్ క్లోజ్‌తో క‌లిసి సంయుక్తంగా అగ్ర‌స్థానంలో కొన‌సాగుతున్నాడు. మ‌రో గోల్ కొడితే మెస్సీ క్లోజ్‌ను దాటి టాప్ స్థానాన్ని కైవ‌సం చేసుకోనున్నాడు. త‌ర్వాతి మ్యాచ్‌లోనే ఆ అద్భుతాన్ని చూసే అవ‌కాశం మ‌న‌కు క‌ల‌గ‌నుంది.

ఫిఫాలో అత్య‌ధిక గోల్స్ కొట్టిన ఆట‌గాళ్ల జాబితా
లియోన‌ల్ మెస్సీ* (అర్జెంటీనా)-16 గోల్స్‌
మిరోస్లావ్ క్లోజ్ (జర్మ‌నీ)- 16 గోల్స్‌
రొనాల్డో (బ్రెజిల్)- 15 గోల్స్‌
ఎంబాపె* (ఫ్రాన్స్‌)-14 గోల్స్‌
గెర్డ్‌ ముల్ల‌ర్ (జ‌ర్మ‌నీ)- 14 గోల్స్‌
జ‌స్ట్ ఫొంటేయిన్ (ఫ్రాన్స్‌)- 13 గోల్స్‌
పీలే (బ్రెజిల్‌)- 12 గోల్స్‌
సాండోర్ కోస్కిస్* (హంగేరి)- 11 గోల్స్‌
జ‌ర్జెన్ క్లిన్స్‌మ‌న్ (జ‌ర్మ‌నీ)- 11 గోల్స్‌ 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement