200వ మ్యాచ్‌లో గోల్‌.. చరిత్ర సృష్టించిన మెస్సీ | Lionel Messi-History-2nd Player-Score Goals-5 different FIFA World Cups | Sakshi
Sakshi News home page

FIFA WC 2026: 200వ మ్యాచ్‌లో గోల్‌.. చరిత్ర సృష్టించిన మెస్సీ

Jun 17 2026 7:50 AM | Updated on Jun 17 2026 8:09 AM

Lionel Messi-History-2nd Player-Score Goals-5 different FIFA World Cups

ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనా స్టార్ లియోనల్ మోస్సీ గోల్స్ వేటను ప్రారంభించాడు. బుధవారం గ్రూప్‌-జెలో అల్జీరియాతో ఆడుతున్న మ్యాచ్‌లో మెస్సీ తొలి గోల్‌తో మెరిశాడు. తొలి హాఫ్ ముగిసేసరికి అర్జెంటీనా 1-0తో అల్జీరియాపై ఆధిక్యంలో నిలిచింది. రికార్డు స్థాయిలో ఆరో ఫిఫా ప్రపంచకప్ ఆడుతున్న మెస్సీకి ఇది 200వ అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. 

మ్యాచ్ ఆరంభం నుంచే హైపర్ యాక్టివ్‌గా కనిపించిన మెస్సీ 38 ఏళ్ల వయసులోనూ మైదానంలో పాదరసంలా పరిగెత్తాడు. 17వ నిమిషంలో ఆఫ్‌సైడ్ దిశగా వచ్చిన బంతిని మెస్సీ నేరుగా గోల్ పోస్ట్‌లోకి తరలించడంతో అర్జెంటీనా ఖాతా తెరిచింది. ఈ నేపథ్యంలో మెస్సీ ఒక అరుదైన రికార్డు సాధించాడు. 


గోల్‌ కొడుతున్న మెస్సీ

ఫుట్‌బాల్ చరిత్రలో ఐదు వేర్వేరు ఫిఫా ప్రపంచకప్పుల్లో గోల్స్ చేసిన రెండో ఆటగాడిగా మెస్సీ నిలిచాడు. ఇంతకముందు క్రిస్టియానో రొనాల్డో ఈ ఘనత సాధించి తొలి స్థానంలో ఉన్నాడు. 

ఇక ఫిఫా చ‌రిత్ర‌లో అత్య‌ధిక గోల్స్ కొట్టిన ఆట‌గాళ్ల జాబితాలో మెస్సీ.. ఎంబాపె, గెరాల్డ్ ముల్ల‌ర్‌ల‌తో క‌లిసి సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాడు. బ్రెజిల్ దిగ్గజం రొనాల్డో (15 గోల్స్‌) రెండో స్థానంలో ఉండ‌గా, జ‌ర్మ‌నీ దిగ్గ‌జం మిరోస్లావ్ క్లోస్ (16 గోల్స్‌) అగ్ర‌స్థానంలో కొన‌సాగుతున్నాడు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement