ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీస్‌.. భారత్‌లో క్రికెట్‌ అభిమానులకు శుభవార్త | India VS England Test Series Will Be Telecast On DD Sports For Free | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీస్‌.. భారత్‌లో క్రికెట్‌ అభిమానులకు శుభవార్త

Jun 18 2025 12:11 PM | Updated on Jun 18 2025 12:11 PM

India VS England Test Series Will Be Telecast On DD Sports For Free

క్రికెట్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ మరో రెండు రోజుల్లో ప్రారంభమవుతుంది. జూన్‌ 20 నుంచి లీడ్స్‌ (హెడింగ్లే) వేదికగా తొలి టెస్ట్‌ జరుగనుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్‌ మధ్యాహ్నం 3:30 గంటలకు మొదలవుతుంది.

ఈ మ్యాచ్‌ భారత్‌లో సోని స్పోర్ట్స్‌ నెటవర్క్‌లో ప్రత్యక్ష ప్రసారమవుతుంది. ఆన్‌లైన్‌ స్ట్రీమింగ్‌ జియో హాట్‌స్టార్‌ యాప్‌తో పాటు వెబ్‌సైట్‌లో జరుగుతుంది. ఈ సిరీస్‌లో ఐదు మ్యాచ్‌లు ఇవే నెట్‌వర్క్‌లలో ప్రత్యక్ష ప్రసారమవుతాయి.

ఈ సిరీస్‌కు ముందు భారత్‌లో ఉన్న క్రికెట్‌ అభిమానులకు శుభవార్త అందింది. ఈ సిరీస్‌లోని మ్యాచ్‌లన్నీ డిడి స్పోర్ట్స్‌లో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతాయి. ఈ ఛానెల్‌లో భారత్‌-ఇంగ్లండ్‌ సిరీస్‌ మొత్తాన్ని ఉచితంగా వీక్షించవచ్చు.

ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ షెడ్యూల్‌..
జూన్‌ 20-24- తొలి టెస్ట్‌ (లీడ్స్‌)
జులై 2-6- రెండో టెస్ట్‌ (బర్మింగ్హమ్‌)
జులై 10-14- మూడో టెస్ట్‌ (లార్డ్స్‌)
జులై 23-27- నాలుగో టెస్ట్‌ (మాంచెస్టర్‌)
జులై 31-ఆగస్ట్‌ 4- ఐదో టెస్ట్‌ (కెన్నింగ్‌స్టన్‌ ఓవల్‌) 

ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌కు భారత జట్టు..
శుభ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), సాయి సుదర్శన్‌, కరుణ్‌ నాయర్‌, అభిమన్యు ఈశ్వరన్‌, యశస్వి జైస్వాల్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, రవీంద్ర జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌, వాషింగ్టన్‌ సుందర్‌, రిషబ్‌ పంత్‌, కేఎల్‌ రాహుల్‌, ధృవ్‌ జురెల్‌, జస్ప్రీత్‌ బుమ్రా, ప్రసిద్ద్‌ కృష్ణ, మహ్మద్‌ సిరాజ్‌, ఆకాశ్‌దీప్‌, అర్షదీప్‌ సింగ్‌, కుల్దీప్‌ యాదవ్‌

భారత్‌తో తొలి టెస్ట్‌కు ఇంగ్లండ్ జట్టు..
బెన్ స్టోక్స్ (కెప్టెన్‌), షోయబ్ బషీర్, జేకబ్ బేతెల్, హ్యారీ బ్రూక్, బ్రైడాన్ కార్స్, సామ్ కుక్, జాక్ క్రాలే, బెన్ డకెట్, జేమీ ఓవర్టన్, ఓలీ పోప్, జో రూట్, జేమీ స్మిత్, జోష్ టంగ్, క్రిస్ వోక్స్

 

Advertisement
 
Advertisement
Advertisement