కేఎల్‌ రాహుల్‌ సూపర్‌ సెంచరీ | IND VS WI 1st Test Day 2: KL Rahul Completes 11th Test Century | Sakshi
Sakshi News home page

కేఎల్‌ రాహుల్‌ సూపర్‌ సెంచరీ

Oct 3 2025 11:34 AM | Updated on Oct 3 2025 12:53 PM

IND VS WI 1st Test Day 2: KL Rahul Completes 11th Test Century

వెస్టిండీస్‌తో జరుగుతున్న అహ్మదాబాద్‌ టెస్ట్‌లో (India vs West Indies) టీమిండియా ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (KL Rahul) సూపర్‌ సెంచరీ సాధించాడు. 190 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో మూడంకెల స్కోర్‌ను చేరుకున్నాడు. రాహుల్‌కు టెస్ట్‌ల్లో ఇది 11వ శతకం. సొంతగడ్డపై మాత్రం ఇది రెండోదే. రాహుల్‌ స్వదేశంలో తన చివరి శతకాన్ని 2016లొ చెన్నైలో ఇంగ్లండ్‌పై చేశాడు.

66 ఓవర్ల తర్వాత భారత్‌ స్కోర్‌ 214/3గా ఉంది. రాహుల్‌కు జతగా ధృవ్‌ జురెల్‌ (10) క్రీజ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం భారత్‌ 52 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇవాళ (అక్టోబర్‌ 2, రెండో రోజు) రాహుల్‌తో పాటు ఇన్నింగ్స్‌ ప్రారంభించిన శుభ్‌మన్‌ గిల్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసిన వెంటనే ఔటయ్యాడు. రోస్టన్‌ ఛేజ్‌ బౌలింగ్‌లో జస్టిన్‌ గ్రీవ్స్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.

భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్‌ 36, సాయి సుదర్శన్‌ 7 పరుగులు చేసి ఔటయ్యాడు. విండీస్‌ బౌలర్లలో రోస్టన్‌ ఛేజ్‌ 2, జేడన్‌ సీల్స్‌ ఓ వికెట్‌ తీశారు.

అంతకుముందు టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన విండీస్‌  162 ప‌రుగుల‌కే ఆలౌటైంది. సిరాజ్‌ (14-3-40-4), బుమ్రా (14-3-42-3), కుల్దీప్‌ (6.1-0-25-2), వాషింగ్టన్‌ సుందర్‌ (3-0-9-1) ధాటికి విండీస్‌ ఇన్నింగ్స్‌ పేకమేడలా కూలింది.

విండీస్‌ ఇన్నింగ్స్‌లో ఏడో నంబర్‌ ఆటగాడు జస్టిన్‌ గ్రీవ్స్‌ చేసిన 32 పరుగులే అత్యధికం. గ్రీవ్స్‌ కాకుండా అలిక్‌ అథనాజ్‌ (12), బ్రాండన్‌ కింగ్‌ (13), కెప్టెన్‌ రోస్టన్‌ ఛేజ్‌ (24), షాయ్‌ హోప్‌ (26), ఖారీ పియెర్‌ (11) అతి కష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు.

మిగతా వారిలో జాన్‌ క్యాంప్‌బెల్‌ 8, తేజ్‌నరైన్‌ చంద్రపాల్‌ డకౌట్‌, జోమెల్‌ వార్రికన్‌ 8, జోహన్‌ లేన్‌ ఒక్క పరుగుకు ఔటయ్యారు. ఈ ఇన్నింగ్స్‌లో భారత వికెట్‌కీపర్‌ ధృవ్‌ జురెల్‌ 4 క్యాచ్‌లు పట్టాడు. కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం వెస్టిండీస్‌ జట్టు భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.

చదవండి: BAN Vs AFG: రషీద్‌ ఖాన్‌ తిప్పేసినా ఆఫ్ఘనిస్తాన్‌కు తప్పని ఓటమి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement