వైభవ్‌ సూర్యవంశీపై ప‌రిశోధ‌న‌లు! | IIM Indore Announced We-Will-Reasearch On Vaibhav Sooryavanshi | Sakshi
Sakshi News home page

వైభవ్‌ సూర్యవంశీపై ప‌రిశోధ‌న‌లు.. ఐఐఎంలో పాఠ్యాంశంగా!

Jun 3 2026 3:53 PM | Updated on Jun 3 2026 4:49 PM

IIM Indore Announced We-Will-Reasearch On Vaibhav Sooryavanshi

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ఓపెన‌ర్ వైభ‌వ్ సూర్య‌వంశీ విధ్వంసం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. సీజ‌న్‌లో 16 మ్యాచ్‌లాడిన వైభ‌వ్ 237 స్ట్రైక్‌రేట్‌తో 776 ప‌రుగులు సాధించి ఆరెంజ్ క్యాప్‌తో పాటు ఎమ‌ర్జింగ్ ప్లేయ‌ర్ అవార్డును అందుకున్నాడు. 15 ఏళ్ల వ‌య‌సులోనే బ్యాటింగ్‌లో సంచ‌ల‌నాలు చేస్తుండ‌డంపై దిగ్గ‌జ క్రికెట‌ర్లు కూడా వైభ‌వ్‌ను అభినందించ‌కుండా ఉండ‌లేక‌పోయారు. 

ఈ నేపథ్యంలో అత‌డి జీవితాన్ని, చిన్న వ‌య‌సులోనే ఒత్తిడిని అధిగ‌మించి ఇవాళ స్టార్ క్రికెట‌ర్ రేంజ్‌కు ఎదిగిన వైభ‌వ్ సూర్య‌వంశీ ఘ‌న‌త‌ను త‌మ పాఠ్యాంశంలో చేర్చాల‌ని ప్ర‌తిష్ఠాత్మ‌క ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)-ఇండోర్ భావిస్తోంది. త్వ‌ర‌లోనే ఈ రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ఓపెన‌ర్‌పై ఐఐఎం-ఇండోర్ ప‌రిశోధ‌న‌లు చేప‌ట్ట‌నుంది. 

చిన్న వ‌య‌సులోనే క్రికెట్‌లో సంచ‌ల‌నాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారిన‌ వైభ‌వ్ సూర్యవంశీపై ఒక ప్ర‌త్యేక కేస్‌స్ట‌డీ చేయ‌నున్న‌ట్లు ఐఐఎం ఇండోర్ ప్ర‌తినిధులుతెలిపారు. దీంతో వైభ‌వ్ సూర్య‌వంశీ మ‌రోసారి వార్త‌ల్లో నిలిచాడు. చిన్న‌వ‌య‌సులోనే స్టార్‌డ‌మ్ రావ‌డం, చిన్న‌వ‌య‌సులోనే స్టార్‌డ‌మ్ రావ‌డం, కెరీర్‌ భవిష్యత్తు, ఒత్తిళ్లు, సవాళ్లు.. వాటి ప్ర‌భావాల‌ను వైభవ్‌ ఎలా అధిగమించాడనే  దానిపై త‌మ సంస్థ‌ అధ్య‌య‌నం చేయనుంద‌ని ఐఐఎం ఇండోర్‌కు చెందిన సీనియ‌ర్ అధికారి ఒక‌రు వెల్ల‌డించారు.

‘బాల మేధావుల అసాధార‌ణ ప్ర‌ద‌ర్శ‌న‌కు ఎలాంటి కార‌కాలు దోహ‌ద‌ప‌డుతాయ‌నేవి తెలుసుకోవాలనుకుంటున్నాం. ఇందుకోసం చిన్న‌త‌నం నుంచే అల‌వ‌డే వ్య‌క్తిత్వం, ప్ర‌వ‌ర్త‌న‌, సాధ‌న ప‌ద్ద‌తులు.. కుటుంబం నుంచి అందుతున్న స‌హ‌కారం, ఉపాధ్యాయులు, కోచ్‌లు, సీనియ‌ర్ల మ‌ద్ద‌తుతో వివిధ రంగాల్లో ఎదుగుతున్న పిల్ల‌ల‌పై అధ్య‌య‌నం చేయాల‌ని నిర్ణ‌యించాం. స్పోర్ట్స్ విభాగంలో వైభ‌వ్ సూర్య‌వం శీని ఎంపిక చేసుకున్నాం. ఇప్ప‌టికే ఈ విష‌యాన్ని అత‌డికి తెలియ‌జేశాము.’ అని ఐఐఎం డైర‌క్ట‌ర్ తెలిపారు.

బాల‌ల ప్ర‌తిభ‌పై సంస్థ జ‌రిపే అధ్య‌య‌నంలో మ‌న‌స్త‌త్వ శాస్త్రం, సామాజిక శాస్త్రం, మాన‌వ వ‌న‌రులు, స‌మాచారవ్యాప్తి, ప్ర‌వ‌ర్త‌న‌కు సంబంధించి ప్ర‌త్యేక ప‌రిశోధ‌న‌లు చేప‌ట్ట‌నున్న‌ట్లు తెలిపారు. ఈ అధ్య‌య‌నం కేవ‌లం క్రీడ‌ల‌కే కాకుండా చిన్న వ‌య‌సులోనే గ‌ణితం, సైన్స్‌, క‌ళ‌లు, ఇత‌ర వృత్తుల్లో రాణిస్తున్న ప్ర‌తిభావంతుల‌పై కూడా జ‌రగ‌నుంది. అయితే ఈ అధ్య‌య‌నం పూర్త‌వ్వ‌డానికి రెండు నుంచి మూడు నెల‌లు ప‌ట్టే అవ‌కాశ‌ముంద‌ని ఐఐఎం ఇండోర్ తెలిపింది.

చదవండి: వరల్డ్‌ నంబర్‌వన్‌ను చావుదెబ్బ కొట్టిన ప్రజ్ఞానంద!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement