breaking news
Child Prodigy
-
వైభవ్ సూర్యవంశీపై పరిశోధనలు!
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సీజన్లో 16 మ్యాచ్‌లాడిన వైభవ్ 237 స్ట్రైక్‌రేట్‌తో 776 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్‌తో పాటు ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డును అందుకున్నాడు. 15 ఏళ్ల వయసులోనే బ్యాటింగ్‌లో సంచలనాలు చేస్తుండడంపై దిగ్గజ క్రికెటర్లు కూడా వైభవ్‌ను అభినందించకుండా ఉండలేకపోయారు. ఈ నేపథ్యంలో అతడి జీవితాన్ని, చిన్న వయసులోనే ఒత్తిడిని అధిగమించి ఇవాళ స్టార్ క్రికెటర్ రేంజ్‌కు ఎదిగిన వైభవ్ సూర్యవంశీ ఘనతను తమ పాఠ్యాంశంలో చేర్చాలని ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)-ఇండోర్ భావిస్తోంది. త్వరలోనే ఈ రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్‌పై ఐఐఎం-ఇండోర్ పరిశోధనలు చేపట్టనుంది. చిన్న వయసులోనే క్రికెట్లో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన వైభవ్ సూర్యవంశీపై ఒక ప్రత్యేక కేస్‌స్టడీ చేయనున్నట్లు ఐఐఎం ఇండోర్ ప్రతినిధులుతెలిపారు. దీంతో వైభవ్ సూర్యవంశీ మరోసారి వార్తల్లో నిలిచాడు. చిన్నవయసులోనే స్టార్డమ్ రావడం, చిన్నవయసులోనే స్టార్డమ్ రావడం, కెరీర్ భవిష్యత్తు, ఒత్తిళ్లు, సవాళ్లు.. వాటి ప్రభావాలను వైభవ్ ఎలా అధిగమించాడనే దానిపై తమ సంస్థ అధ్యయనం చేయనుందని ఐఐఎం ఇండోర్‌కు చెందిన సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.‘బాల మేధావుల అసాధారణ ప్రదర్శనకు ఎలాంటి కారకాలు దోహదపడుతాయనేవి తెలుసుకోవాలనుకుంటున్నాం. ఇందుకోసం చిన్నతనం నుంచే అలవడే వ్యక్తిత్వం, ప్రవర్తన, సాధన పద్దతులు.. కుటుంబం నుంచి అందుతున్న సహకారం, ఉపాధ్యాయులు, కోచ్‌లు, సీనియర్ల మద్దతుతో వివిధ రంగాల్లో ఎదుగుతున్న పిల్లలపై అధ్యయనం చేయాలని నిర్ణయించాం. స్పోర్ట్స్ విభాగంలో వైభవ్ సూర్యవం శీని ఎంపిక చేసుకున్నాం. ఇప్పటికే ఈ విషయాన్ని అతడికి తెలియజేశాము.’ అని ఐఐఎం డైరక్టర్ తెలిపారు.బాలల ప్రతిభపై సంస్థ జరిపే అధ్యయనంలో మనస్తత్వ శాస్త్రం, సామాజిక శాస్త్రం, మానవ వనరులు, సమాచారవ్యాప్తి, ప్రవర్తనకు సంబంధించి ప్రత్యేక పరిశోధనలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ అధ్యయనం కేవలం క్రీడలకే కాకుండా చిన్న వయసులోనే గణితం, సైన్స్, కళలు, ఇతర వృత్తుల్లో రాణిస్తున్న ప్రతిభావంతులపై కూడా జరగనుంది. అయితే ఈ అధ్యయనం పూర్తవ్వడానికి రెండు నుంచి మూడు నెలలు పట్టే అవకాశముందని ఐఐఎం ఇండోర్ తెలిపింది.చదవండి: వరల్డ్ నంబర్‌వన్‌ను చావుదెబ్బ కొట్టిన ప్రజ్ఞానంద! -
15 ఏళ్లకే ఇంజినీర్ అయ్యాడు!
వాషింగ్టన్ : ప్రతిభకు వయస్సు అడ్డంకి కాదు. ఈ విషయాన్ని మరోసారి నిరూపించాడు తనిష్క్ అబ్రహం.. చిన్నవయస్సులోనే అపారమైన మేధస్సుతో అబ్బురపరుస్తున్న ఈ బాలమేధావి మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. 15 ఏళ్లకే ఇంజినీర్‌గా పట్టభద్రుడు అయ్యాడు. యూసీ డేవిస్ విద్యాసంస్థ నుంచి బయోమెడికల్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పట్టా పొందాడు. భారత సంతతికి చెందిన తనిష్క్ అబ్రహం తన మేధస్సుతో అమెరికాలో విశేషమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. చిన్నవయస్సులోనే చదువులో అసాధారణ ప్రతిభ చాటుతూ.. మూడేళ్ల కిందటే మూడు డిగ్రీలు పొందాడు. ఇప్పుడు తాజాగా బయోమెడికల్ ఇంజినీరింగ్‌లో పట్టభద్రుడైన తనిష్క పీహెచ్డీ చేసి.. డాక్టరేట్ పట్టా పొందాలని భావిస్తున్నాడు. 15వ ఏట అడుగుపెట్టడానికి కొన్నిరోజుల ముందే ఫాదర్స్ డే సందర్భంగా తనిష్క్ ఈ డిగ్రీ పట్టా పొందాడు. అక్కడితో అతను ఆగిపోలేదు. వెంటనే యూసీ డేవిస్ మెడికల్ సెంటర్లో తన సీనియర్ డిజైన్ ప్రాజెక్టును సమర్పించాడు. అనంతరం సదరన్ కాలిఫోర్నియాలో జరిగిన బయోమెడికల్ ఇంజినీరింగ్ సదస్సులో పాల్గొని.. తన పరిశోధన ప్రాజెక్టు డిజైన్‌ను సమర్పించాడు. అంతేకాకుండా యూసీడీ ఎంటర్‌ప్రిన్యూర్‌షిప్ అకాడెమీలో నిర్వహించిన 3రోజుల క్రాష్కోర్సులోనూ అతను చేరాడు. బాలమేధావి తనిష్క్ అబ్రహంకు సంబంధించి మరిన్ని కథనాలు.. అమెరికా అధ్యక్ష పదవిపై బాలుడి గురి ఈ బుడ్డోడు సూపర్ ఫాస్ట్! 10 ఏళ్లకే హైస్కూల్ విద్య పూర్తి! -
తొమ్మిదేళ్ళకే సీఈవో.. సైబర్ సెక్యూరిటీ నిపుణుడు..!
తొమ్మిదేళ్ళకే ఆ కుర్రోడు.. తన ప్రతిభను ప్రపంచానికి చాటాడు. స్వంత గేమ్ అభివృద్ధి సంస్థకు సీఈవోగా, నిష్ణాతుడైన హ్యాకర్‌గా, యాప్ డెవలపర్‌గా, సైబర్ క్రైం బస్టర్ గా తనను తాను నిరూపించుకున్నాడు. ఢిల్లీలో జరిగిన గ్రౌండ్ జీరో సమ్మిట్ 2015 కు హాజరైన వారిలో అత్యంత పిన్న వయస్కుడైన రూబేను పాల్... సమాచార భద్రతపై ఆసియాలో జరిగిన మొట్టమొదటి సమావేశంలో అందరినీ ఆశ్చర్య పరచడమే కాక, ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరైన ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ పరిశోధకులు, సైబర్ నిపుణులు.. మైక్రోఫోన్ పై ప్రసంగిస్తున్నసభలో... వెనుక ఉన్న కుర్చీపై నిలుచొని తొమ్మిదేళ్ళ చిన్నారి రూబేను ప్రత్యేకంగా కనిపించాడు. భారత సంతతికి చెందిన ఆ చిన్నారి గత ఏడాది నవంబర్ 14న జరిగిన సదస్సులో తన సొంత కీలకోపన్యాసం చేశాడు. అయితే ఈ ఏడాది అతడో స్పెషల్ గెస్ట్ గా మారిపోయాడు. పిల్లలకు సైబర్ భద్రతా బోధనలో తన జ్ఞానాన్ని పంచగలిగే రాయబారి అయిపోయాడు. హ్యాకింగ్ లో నైపుణ్యం పొందగల్గితే ఎంతో శక్తి వస్తుందని, ఆ శక్తి వల్ల ఎంతో బాధ్యత కూడ వస్తుందంటున్నాడు తన హీరోగా స్పైడర్ మ్యాన్ ను ఊహించుకునే రూబేను. టెక్సాస్ విద్యా వ్యవస్థ నిర్వహించే టెక్సాస్ లోని ఆస్టిన్ స్కూల్లో జరిగే గిఫ్టెడ్ ట్యాలెంటెడ్ కార్యక్రమానికి రూబేను ఎంపికయ్యాడని, ఓ గేమ్ ను తయారు చేయడానికి అవకాశం కూడ అతడికి వచ్చిందని రూబేను తల్లి సంగీత తెలిపారు. రూబేను కు వీడియో గేమ్స్ తయారు చేయడం అంటే ఎంతో ఇష్టమని ఇప్పుడు షూటింగ్ నింజా స్టార్స్ గేమ్‌ను చేయాలనుకుంటున్నాడని ఆమె అన్నారు. ఐదేళ్ళ ప్రాయంలోనే రూబేను ఫైర్ వాల్ వంటి పదాలు వాడుతుండటం చూసి మేము ఎంతో ఆశ్చర్యపోయేవాళ్ళమని రూబేను తండ్రి తెలిపారు. అతడు యాప్ లు డెవలప్ చేసేందుకు ముందు కుంగ్ ఫూ, జిమ్నాస్టిక్స్, స్విమ్మింగ్ నేర్చుకునేవాడని, స్నేహితులతో ఎక్కువ సమయం గడిపేవాడని రూబేను తల్లిదండ్రులు చెప్తూ.. ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.


