ఇంగ్లండ్‌కు ఘనా షాక్‌.. క్రొయేషియా బోణీ | Ghana Ends-England 12 Game Winning streak-Croatia Beat Panama | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌కు ఘనా షాక్‌.. క్రొయేషియా బోణీ

Jun 24 2026 7:53 AM | Updated on Jun 24 2026 11:38 AM

Ghana Ends-England 12 Game Winning streak-Croatia Beat Panama

నిరాశలో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ హ్యారీకేన్‌

ఫిఫా ప్రపంచకప్‌లో గ్రూప్‌-ఎల్‌లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఇంగ్లండ్‌తో  మ్యాచ్‌ను ఘనా డ్రా చేసుకోగా, మరో మ్యాచ్‌లో క్రొయేషియా 1-0 తేడాతో పనామాను చిత్తు చేసి టోర్నీలో తొలి విజయాన్ని అందుకుంది. ఇంగ్లండ్‌, ఘనా మ్యాచ్ విషయానికొస్తే నిర్ణీత సమయంలో ఇరుజట్లు గోల్ కొట్టడంలో విఫలమయ్యాయి. 2024లో నుంచి వ‌రుస‌గా 12 విజ‌యాల‌తో అద‌ర‌గొట్టిన ఇంగ్లండ్ జోరుకు ఘ‌నా డ్రా రూపంలో అడ్డుక‌ట్ట వేసింది. 


ఘనా గోల్‌ కీపర్‌ బెంజమిన్‌ విన్యాసం

2024లో గ్రీస్‌పై విజ‌యం త‌ర్వాత ఇంగ్లండ్ తాను ఆడిన 12 అంత‌ర్జాతీయ మ్యాచ్‌ల్లోనూ గెలుపొందింది. అయితే మ్యాచ్ ఆద్యంతం ఘ‌నాపై ఇంగ్లండ్ ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించింది. 19 సార్లు ఘ‌నా గోల్ పోస్ట్‌పై దాడులు చేసిన‌ప్ప‌టికీ ఆ జ‌ట్టు గోల్‌కీప‌ర్ బెంజ‌మిన్ అసారే అడ్డుగోడ‌లో నిల‌బ‌డి మ్యాచ్ విన్న‌ర్‌గా నిలిచాడు.దీంతో చెరో పాయింట్ దక్కించుకున్న ఇంగ్లండ్, ఘనాలు చెరో 4 పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఇంగ్లండ్ పనామాతో, ఘనా క్రొయేషియాతో తమ చివరి మ్యాచ్‌లు ఆడనున్నాయి.


ఘనా గోల్‌ కీపర్‌ బెంజమిన్‌ 

 

 

లూకా మోడ్రిక్ 200వ మ్యాచ్‌..
తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో చిత్తయిన క్రొయేషియా పనామాపై జూలు విదిల్చింది. నిర్ణీత సమయం ముగిసేసరికి 1-0తో నిలిచింది. క్రొయేషియా తరఫున ఆట 54వ నిమిషంలో ఆంటే బుడిమిర్ గోల్ కొట్టాడు. ఇక క్రొయేషియా కెప్టెన్ లూకా మోడ్రిక్‌కు ఇది 200వ అంతర్జాతీయ మ్యాచ్‌. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో 200 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న నాలుగో ఆటగాడిగా లూకా మోడ్రిక్ నిలిచాడు. 


 క్రొయేషియా ఆటగాడు  ఆంటే బుడిమిర్, 200వ మ్యాచ్‌ ఆడుతున్న లూకా మోడ్రిక్‌

గతంలో క్రిస్టియానో రొనాల్డో (230), బాదర్ అహ్మద్ (202), లియోనల్ మెస్సీ (201) ఈ ఫీట్ సాధించారు. ఇక పనామా జట్టు చెత్త రికార్డు మూటగట్టుకుంది. క్రొయేషియా చేతిలో ఓటమితో ఆడిన ఐదే ఫిఫా ప్రపంచకప్ మ్యాచ్‌ల్లోనూ ఓటమి చవిచూసిన జట్టుగా నిలిచింది. ఇంతకముందు ఎల్ సాల్వడార్ జట్టు ఆరు ఫిఫా మ్యాచ్‌లు ఆడితే ఆరింటిలోనూ ఓడిపోయి 100 శాతం ఓటమి రికార్డుతో మొదటి స్థానంలో ఉంది.

చదవండి: పోర్చుగ‌ల్ విజయం.. 60 ఏళ్ల రికార్డు బ‌ద్ద‌లు కొట్టిన రొనాల్డో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement