భార‌త్‌తో టీ20 సిరీస్‌.. ఇంగ్లండ్ జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌! యువ సంచలనానికి ఛాన్స్‌ | England announces squad for IND vs ENG T20I series | Sakshi
Sakshi News home page

IND vs ENG: భార‌త్‌తో టీ20 సిరీస్‌.. ఇంగ్లండ్ జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌! యువ సంచలనానికి ఛాన్స్‌

Jun 22 2026 10:03 PM | Updated on Jun 22 2026 10:03 PM

England announces squad for IND vs ENG T20I series

స్వదేశంలో భారత్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు 17 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్‌గా హ్యారీ బ్రూక్ వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. కాగా టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌తో పాటు ఐపీఎల్‌లోనూ పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచిన స్టార్ బ్యాట‌ర్ జోస్ బ‌ట్ల‌ర్‌కు సెల‌క్ట‌ర్లు మ‌రో అవ‌కాశమిచ్చారు. 

అత‌డితో పాటు ఆదిల్ రషీద్, పేసర్ జోఫ్రా ఆర్చర్, ఫిల్ సాల్ట్,  టామ్ బాంటన్, సామ్ కరన్ వంటి సీనియర్ ప్లేయ‌ర్లు ఈ జ‌ట్టులో ఉన్నారు. మరోవైపు వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన జోర్డాన్ కాక్స్, సన్నీ బేకర్, సాకిబ్ మహమూద్‌లు తిరిగి జ‌ట్టులోకి వ‌చ్చారు. యువ ఆటగాళ్లు జాకబ్ బెథెల్, విల్ జాక్స్, జోష్ టంగ్ కూడా త‌మ స్ధానాల‌ను నిల‌బెట్టుకున్నారు.

అయితే ఈ సిరీస్‌కు స్టార్ ఆల్‌రౌండ‌ర్లు బ్రైడన్ కార్స్,  జేమీ ఓవర్టన్‌లు ఇద్దరూ గాయాల కారణంగా దూర‌మయ్యారు. దీంతో  ససెక్స్ ఆల్‌రౌండ‌ర్ 22 ఏళ్ల జేమ్స్ కోల్స్ తొలిసారి ఇంగ్లండ్ జాతీయ జ‌ట్టులో చోటు ద‌క్కింది. టీ20 క్రికెట్‌లో కోల్స్‌కు అద్భుత‌మైన రికార్డు ఉంది. 71 టీ20 మ్యాచ్‌లు ఆడిన కోల్స్.. 1,373 పరుగులతో పాటు 53 వికెట్లు ప‌డ‌గొట్టాడు. వైటాలిటీ బ్లాస్ట్, ది హండ్రెడ్ టోర్నీలతో పాటు సౌతాఫ్రికా టీ20 వంటి ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్‌లో ఆడిన అనుభ‌వం ఉంది.

భారత్‌తో సిరీస్ కోసం ఇంగ్లండ్‌ టీ20 జట్టు:
హ్యారీ బ్రూక్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, సన్నీ బేకర్, టామ్ బాంటన్, జాకబ్ బెథెల్, జోస్ బట్లర్, జేమ్స్ కోల్స్, జోర్డాన్ కాక్స్, సామ్ కరన్, లియామ్ డాసన్, విల్ జాక్స్, సాకిబ్ మహమూద్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, జోష్ టంగ్, ల్యూక్ వుడ్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement