స్టోక్స్‌పై పిడిగుద్దుల వర్షం.. ఎవరీ రగ్బీ ప్లేయర్‌? | Ben Stokes Nightclub Brawl Turns Ugly, Rugby Player Punches Stokes, ECB Probes Shocking Incident With Gus Atkinson | Sakshi
Sakshi News home page

సంచలన విషయాలు వెలుగులోకి; స్టోక్స్‌పై పిడిగుద్దుల వర్షం.. ఎవరీ రగ్బీ ప్లేయర్‌?

Jun 10 2026 12:05 PM | Updated on Jun 10 2026 1:56 PM

ECB Shocking-Rugby Player Punches-Stokes-Atkinson-Night Club Incident

ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌,  సహచర బౌలర్ గస్ అట్కిన్సన్‌లు వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. బోర్డు అనుమతి లేకుండా నైట్‌క్లబ్‌కు వెళ్లిన స్టోక్స్‌, అట్కిన్సన్ ఫూటుగా తాగి బీర్‌బాటిళ్లు విసిరేసి అపరిచితులపై దాడి చేశారు. దీంతో జట్టు నిబంధనలను ఉల్లంఘించినందుకు న్యూజిలాండ్‌తో రెండో టెస్టుకు వీరిద్దరిని సస్పెండ్ చేసే అవకాశముంది. 

స్టోక్స్‌, అట్కిన్సన్‌పై చర్యలు తీసుకోవడానికి ముందు మరింత సమాచారం సేకరిస్తున్నట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) తెలిపింది. సమాచార సేకరణలో కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు ఈసీబీ పేర్కొంది. ఈసీబీ తెలిపిన ప్రకారం.. స్టోక్స్ దాడి చేయడానికి ముందే రగ్బీ ఆటగాడు, 21 ఏళ్ల టోటోవా ఔవా స్టోక్స్‌, అట్కిన్సన్‌లపై పిడిగుద్దుల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది.  

టోటోవా ఔవాను కించపరిచే విధంగా స్టోక్స్ మాట్లాడాడని, ఆ తర్వాత ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. నైట్‌క్లబ్‌లోనే స్టోక్స్‌, అట్కిన్సన్‌లతో టోటోవా ఔవాతో పాటు అతడి సహచరులు ఘర్షణకు దిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో స్టోక్స్‌ను కిందపడేసి టోటోవా పిడి గుద్దులు కురిపించాడు. అడ్డువచ్చిన అట్కిన్సన్‌ను కూడా చితకబాదాడు. 

అయితే గొడవ పతాక స్థాయికి చేరడంతో బౌన్సర్లు వారందరిని బయటికి పంపించేశారు. అయితే బయటికి వచ్చాకా స్టోక్స్‌, అట్కిన్సన్‌లు తమ వద్ద ఉన్న బీర్ బాటిళ్లను విసిరి టోటోవా అనుచరులను కిందపడేసి విచక్షణారహితంగా దాడికి పాల్పడడం వీడియోలో బయటపడింది. ఈ దాడికి ముందే టోటోవా అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు ఈసీబీ తెలిపింది. 

ఈ సమాచారం మొత్తం తమకు నైట్‌క్లబ్ సీసీటీవీ ఫుటేజీలో దొరికిందని వెల్లడించిన ఈసీబీ.. స్టోక్స్‌, అట్కిన్సన్‌లపై క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ఒకవేళ స్టోక్స్‌పై వేటు పడితే కివీస్‌తో రెండో టెస్టుకు హ్యారీ బ్రూక్ జట్టును నడిపించనున్నాడు.

ఎవరీ టోటోవా?


ఇంగ్లండ్ క్రికెటర్ స్టోక్స్‌పై పిడిగుద్దుల వర్షం కురిపించిన టోటోవా ఔవా ఎవరని సోషల్ మీడియాలో తెగ వెతికేస్తున్నారు.  రగ్బీ ప్లేయర్ అయిన టోటోవా సరసెన్స్ అకాడమీలో రగ్బీ శిక్షణ తీసుకుంటున్నాడు. అయితే ఇప్పటివరకు రగ్బీ మ్యాచ్ ఆడలేదు. 6 అడుగుల 5 అంగుళాల ఎత్తు, 125 కిలోల బరువుతో బాహుబలి రూపంతో ఆకర్షిస్తున్నాడు. స్టోక్స్‌తో గొడవపడిన  టోటోవా ఔవా రాత్రికిత్రే స్టార్ అయి పోయాడు.

చదవండి: మళ్లీ గాయపడిన పాండ్యా.. ఆఫ్గన్‌తో వన్డే సిరీస్‌కు దూరం!

Advertisement
 
Advertisement
Advertisement