రెండు పతకాలపై ధీరజ్‌ గురి | Dheeraj aims for two medals | Sakshi
Sakshi News home page

రెండు పతకాలపై ధీరజ్‌ గురి

Jun 22 2024 3:57 AM | Updated on Jun 22 2024 3:57 AM

Dheeraj aims for two medals

వ్యక్తిగత, మిక్స్‌డ్‌ విభాగాల్లో ముందంజ  

అంటాల్యా (టర్కీ): ప్రపంచకప్‌ ఆర్చరీ స్టేజ్‌–3 టోర్నీ పురుషుల రికర్వ్‌ విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ప్లేయర్‌ బొమ్మదేవర ధీరజ్‌ రెండు పతకాల రేసులో నిలిచాడు. రికర్వ్‌ మిక్స్‌డ్‌ విభాగంలో భజన్‌ కౌర్‌తో కలిసి 
ధీరజ్‌ ఆదివారం కాంస్య పతకం కోసం పోటీపడనున్నాడు. 

దాంతోపాటు పురుషుల రికర్వ్‌ వ్యక్తిగత విభాగంలోనూ ధీరజ్‌ సెమీఫైనల్‌ చేరుకున్నాడు. వ్యక్తిగత విభాగం క్వార్టర్‌ ఫైనల్లో ధీరజ్‌ 7–3 (28–29, 28–27, 29–29, 28–27, 30–27)తో వెటెర్‌ (జర్మనీ)పై గెలిచాడు. మిక్స్‌డ్‌ విభాగం సెమీఫైనల్లో ధీరజ్‌–భజన్‌ కౌర్‌ ద్వయం 3–5 (37–34, 36–38, 37–37, 36–38)తో జెన్‌ హన్‌యంగ్‌–లీ వూసియోక్‌ (కొరియా) జంట చేతిలో ఓడింది.

 

Advertisement
 
Advertisement
Advertisement