World Cup Archery
-
భారత్ ‘పాంచ్ పటాకా’
షాంఘై: ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–2 టోర్నమెంట్లో భారత కాంపౌండ్ ఆర్చర్లు 5 పతకాలతో సత్తాచాటారు. వ్యక్తిగత విభాగంలో మధుర స్వర్ణ పతకంతో మెరిసింది. దీంతో ఈ టోర్నీలో భారత ఆర్చర్లకు మొత్తంగా 2 స్వర్ణాలు, ఒక రజతం, 2 కాంస్యాలు దక్కాయి. మహిళల కాంపౌండ్ వ్యక్తిగత ఫైనల్లో మధుర 139–138తో కార్సన్ (అమెరికా)పై గెలుపొందింది. మహారాష్ట్రకు చెందిన 24 ఏళ్ల మధుర ఈ టోర్నీలో ఓవరాల్‌గా మూడు పతకాలు గెలుచుకుంది. వ్యక్తిగత విభాగంలో పసిడి నెగ్గిన మధుర... టీమ్ ఈవెంట్లో రజతం, మిక్స్డ్ విభాగంలో కాంస్యం గెలిచిన జట్లలో కూడా సభ్యురాలు. ఫైనల్లో మొదట ‘పర్ఫెక్ట్ 30’ పాయింట్లు సాధించిన మధుర ఆ తర్వాత ఆకట్టుకోలేకపోయింది. ఒకదశలో వరుసగా రెండు సార్లు 8 పాయింట్లతో పాటు ఒకసారి 7 పాయింట్లు ఖాతాలో వేసుకొని 81–85తో వెనుకంజలో పడింది. తర్వాతి రౌండ్లో మెరుగైన ప్రదర్శనతో స్కోరును 110–110తో సమం చేసి... అదే జోరు కొనసాగిస్తూ పసిడి ఖాతాలో వేసుకుంది. అంతకుముందు కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో భారత పురుషుల జట్టు స్వర్ణం గెలుచుకుంది. అభిషేక్ వర్మ, రిషభ్ యాదవ్, ఓజస్ ప్రవీణ దేవ్‌తలేలతో కూడిన భారత పురుషుల జట్టు ఆదివారం జరిగిన ఫైనల్లో 232–228 పాయింట్ల తేడాతో మెక్సికో జట్టుపై గెలుపొందింది. ఇక పురుషుల వ్యక్తిగత విభాగంలో 22 ఏళ్ల రిషభ్ యాదవ్ కాంస్య పతకంతో మెరిశాడు. షూటాఫ్‌లో అతడు దక్షిణ కొరియా ఆర్చర్‌పై విజయం సాధించాడు. వెన్నం జ్యోతి సురేఖ (ఆంధ్రప్రదేశ్), తనిపర్తి చికిత (తెలంగాణ), మధుర (మహారాష్ట్ర) లతో కూడిన భారత మహిళల కాంపౌండ్ జట్టు రజత పతకం చేజిక్కించుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో సురేఖ, చికిత, మధుర త్రయం. 221–234తో మెక్సికో జట్టు చేతిలో ఓడింది. ఇక మిక్స్డ్ టీమ్ విభాగంలో మధుర–అభిõÙక్ వర్మ జంట కాంస్యం గెలుచుకుంది. కాంస్య పతక పోరులో భారత జోడీ 144–142 పాయింట్ల తేడాతో ఫాటిన్ నూర్‌ఫతే–మొహమ్మద్ జువైదీ (అమెరికా)పై గెలుపొందింది. తాజా ప్రదర్శనతో భారత కాంపౌండ్ జట్టు భవిష్యత్తుపై మరిన్ని అంచనాలు పెరుగుతున్నాయి. తొలి సారి 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో ఆర్చరీ కాంపౌండ్ టీమ్ ఈవెంట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఇదే జోరు కొనసాగిస్తే మనకు ఒలింపిక్స్‌కు పతకం సాధించేందుకు మంచి అవకాశం ఉంది. -
మూడు పతకాలకు విజయం దూరంలో
షాంఘై: ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–2 టోర్నమెంట్లో భారత ఆర్చర్లు మూడు విజయాలు సాధిస్తే మూడు పతకాలను ఖరారు చేసుకుంటారు. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో అభిషేక్ వర్మ (ఢిల్లీ)–మధుర (మహారాష్ట్ర) జోడీ కాంస్య పతకం కోసం పోటీపడనుండగా... మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో దీపిక కుమారి... పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో పార్థ్ సాలుంఖే సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. సెమీఫైనల్లో గెలిస్తే దీపిక, పార్థ్ స్వర్ణ, రజత పతకాల కోసం రేసులో నిలుస్తారు. సెమీఫైనల్లో ఓడిపోతే కాంస్య పతకం కోసం పోటీపడతారు. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ సెమీఫైనల్లో అభిషేక్–మధుర ద్వయం 156–158తో ఎల్లా గిబ్సన్–అజయ్ స్కాట్ (బ్రిటన్) జంట చేతిలో ఓడిపోయింది. నేడు జరిగే కాంస్య పతక మ్యాచ్‌లో ఫాటిన్ నూర్‌ఫతే–మొహమ్మద్ జువైదీ (అమెరికా)లతో అభిషేక్, మధుర తలపడతారు. పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో ఒలింపియన్, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ ధీరజ్ బొమ్మదేవర, తరుణ్‌దీప్ రాయ్ తొలి రౌండ్లో, అతాను దాస్ క్వార్టర్ ఫైనల్లో ని్రష్కమించారు. ధీరజ్ 5–6తో అబ్దుల్లా (టర్కీ) చేతిలో, తరుణ్‌దీప్ 5–6తో తెత్సుయ (జపాన్) చేతిలో, అతాను దాస్ 2–6తో కిమ్ వూజిన్ (కొరియా) చేతిలో ఓడిపోయారు. పార్థ్ సాలుంఖే తొలి రౌండ్లో 6–5తో 2020 టోక్యో ఒలింపిక్స్ స్వర్ణపతక విజేత మెటీ గాజోజ్ (టర్కీ)పై, రెండో రౌండ్లో 6–5తో తెత్సుయ (జపాన్)పై, మూడో రౌండ్లో 6–2తో రియాన్ ట్యాక్ (ఆస్ట్రేలియా)పై, క్వార్టర్ ఫైనల్లో 6–2తో కిమ్ జె డియోక్ (కొరియా)పై గెలుపొందాడు. మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో ‘ట్రిపుల్ ఒలింపియన్’ దీపిక కుమారి తొలి రౌండ్లో 6–4తో లూసియా (స్పెయిన్)పై, రెండో రౌండ్లో 6–0తో డయానా (కజకిస్తాన్)పై, మూడో రౌండ్లో 6–4తో విక్టోరియా (ఫ్రాన్స్)పై, క్వార్టర్ ఫైనల్లో 6–2తో లీ జియామన్ (చైనా)పై విజయం సాధించింది. భారత్‌కే చెందిన అంకిత మూడో రౌండ్లో 3–7తో లిమ్ సిహైన్ (కొరియా) చేతిలో, అన్షిక తొలి రౌండ్లో 5–6తో ఎలీసా టార్ట్లెర్ (జర్మనీ) చేతిలో, సిమ్రన్‌జిత్ తొలి రౌండ్లో 3–7తో యుహెరా రుకా (జపాన్) చేతిలో ఓటమి చవిచూశారు. -
భారత్ చేజారిన కాంస్యం
షాంఘై: ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–2 టోర్నమెంట్లో భారత రికర్వ్ పురుషుల, మహిళల జట్లు పతకం సాధించడంలో విఫలమయ్యాయి. ధీరజ్ బొమ్మదేవర (ఆంధ్రప్రదేశ్), అతాను దాస్ (బెంగాల్), తరుణ్‌దీప్ రాయ్ (సిక్కిం)లతో కూడిన భారత పురుషుల జట్టు త్రుటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకోగా... దీపిక కుమారి (జార్ఖండ్), అంకిత (బెంగాల్), అన్షిక కుమారి (బిహార్)లతో కూడిన భారత మహిళల జట్టు మాత్రం రెండో రౌండ్లోనే వెనుదిరిగింది. కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో భారత ప్లేయర్లు మధుర (మహారాష్ట్ర), రిషభ్ యాదవ్ (హరియాణా) సెమీఫైనల్ చేరుకొని పతకాల వేటలో నిలిచారు. క్రిస్టియన్ స్టాడర్డ్, బ్రాడీ ఎలీసన్, జాక్ విలియమ్స్‌లతో కూడిన అమెరికా జట్టుతో కాంస్య పతక మ్యాచ్‌లో భారత పురుషుల జట్టు 3–5 సెట్ పాయింట్లతో ఓడిపోయింది. తొలి సెట్‌ను అమెరికా 57–56తో నెగ్గి 2 పాయింట్లు సాధించింది. రెండో సెట్ 56–52తో అమెరికా ఖాతాలోనే వెళ్లింది. అమెరికా ఆధిక్యం 4–0కు పెరిగింది. మూడో సెట్‌ను భారత్ 55–54తో గెలిచి 2 పాయింట్లు సంపాదించింది. నాలుగో సెట్లో రెండు జట్లు 56–56తో సమంగా నిలిచాయి. దాంతో రెండు జట్లకు ఒక్కో పాయింట్ దక్కింది. ఓవరాల్‌గా అమెరికా 5–3తో విజయాన్ని ఖరారు చేసుకొని కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. అంతకుముందు భారత జట్టు 5–4తో (53–51, 55–58, 55–56, 54–53, 29–27) కజకిస్తాన్‌పై గెలిచింది. నాలుగు సెట్ల తర్వాత రెండు జట్లు 4–4తో సమంగా నిలిచాయి. దాంతో ‘షూట్ ఆఫ్’ నిర్వహించగా... భారత్ పైచేయి సాధించింది. క్వార్టర్ ఫైనల్లో భారత్ 6–0తో (58–56, 57–56, 55–53)తో ఇటలీపై నెగ్గింది. సెమీఫైనల్లో టీమిండియా 4–5తో (51–54, 50–56, 56–55, 55–53, 25–26) ‘షూట్ ఆఫ్’లో ఫ్రాన్స్ జట్టు చేతిలో ఓడిపోయింది. తొలి రౌండ్లో ‘బై’ పొంది నేరుగా రెండో రౌండ్ మ్యాచ్ ఆడిన భారత మహిళల జట్టు 4–5తో (49–50, 52–54, 52–45, 55–48, 26–27)తో ‘షూట్ ఆఫ్’లో అలెజాంద్రా వలెన్సియా, వాలెంటీనా వాజ్క్వెజ్, మోంటాయ అల్ఫారోలతో కూడిన మెక్సికో జట్టు చేతిలో ఓడిపోయింది. చికిత, జ్యోతి సురేఖలకు నిరాశ మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ, తెలంగాణ క్రీడాకారిణి తనిపర్తి చికిత, ప్రపంచ చాంపియన్ అదితి స్వామి నిరాశపరచగా... మధుర సెమీఫైనల్లోకి ప్రవేశించింది. క్వార్టర్ ఫైనల్లో మధుర 142–141తో జ్యోతి సురేఖను ఓడించింది. రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో చికిత 134–138తో అదెల్ జెక్సెన్‌బినోవా (కజకిస్తాన్) చేతిలో, అదితి 129–140తో కార్సన్ క్రాహి (అమెరికా) చేతిలో ఓడిపోయారు.పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత క్వార్టర్ ఫైనల్లో రిషభ్ డెన్మార్క్‌కు చెందిన మథియాస్ ఫులర్టన్‌పై గెలిచాడు. నిర్ణీత 15 బాణాల తర్వాత ఇద్దరూ 147–147తో సమంగా నిలిచారు. ‘షూట్ ఆఫ్’లోనూ ఇద్దరూ 10 పాయింట్లు స్కోరు చేశారు. అయితే రిషభ్ సంధించిన బాణం కేంద్ర బిందువుకు అతి సమీపంగా ఉండటంతో అతనికి సెమీఫైనల్ బెర్త్ ఖరారైంది. -
రెండు స్వర్ణాలపై భారత్ గురి
షాంఘై: ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–2 టోర్నమెంట్లో భారత్‌కు రెండు పతకాలు ఖాయమయ్యాయి. బుధవారం జరిగిన కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో భారత పురుషుల, మహిళల జట్లు ఫైనల్లోకి దూసుకెళ్లాయి. ఫలితంగా భారత్ ఖాతాలో కనీసం రెండు స్వర్ణాలు లేదా రెండు రజతాలు చేరనున్నాయి. వెన్నం జ్యోతి సురేఖ (ఆంధ్రప్రదేశ్), తనిపర్తి చికిత (తెలంగాణ), మధుర (మహారాష్ట్ర)లతో కూడిన భారత మహిళల కాంపౌండ్ జట్టు... అభిõÙక్ వర్మ, రిషభ్ యాదవ్, ఓజస్ ప్రవీణ్ దేవ్‌తలేలతో కూడిన భారత పురుషుల కాంపౌండ్ జట్టు టైటిల్ పోరుకు అర్హత సాధించాయి. మరోవైపు మెక్సికో పురుషుల, మహిళల జట్లు కూడా ఫైనల్లోకి అడుగు పెట్టాయి. శనివారం భారత్, మెక్సికో జట్లు రెండు స్వర్ణాల కోసం పోటీపడతాయి. క్వాలిఫయింగ్‌లో అగ్రస్థానంలో నిలిచినందుకు... భారత జట్లకు నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు ‘బై’ లభించింది. క్వార్టర్ ఫైనల్లో భారత మహిళల జట్టు 232–229 పాయింట్ల తేడాతో అదెల్ జెక్సెన్‌బినోవా, విక్టోరియా లియాన్, రొక్సానా యునోసోవాలతో కూడిన కజకిస్తాన్ జట్టును ఓడించింది. సెమీఫైనల్లో భారత జట్టు 232–230 పాయింట్లతో ఎల్లా గిబ్సన్, ఇసబెల్లా కార్పెంటర్, లేలా అనిసన్‌లతో కూడిన బ్రిటన్ జట్టుపై గెలిచింది. క్వార్టర్ ఫైనల్లో భారత పురుషుల జట్టు 239–232 పాయింట్ల తేడాతో అజయ్ స్కాట్, ఆడమ్ కార్పెంటర్, ల్యూక్ డేవిస్‌లతో కూడిన బ్రిటన్ జట్టుపై నెగ్గింది. సెమీఫైనల్లో భారత బృందం 232–231 పాయింట్ల తేడాతో మథియాస్ ఫులర్టన్, మారి్టన్ డామ్స్‌బో, నిక్లాస్ బ్రెడాల్‌లతో కూడిన డెన్మార్క్ జట్టును ఓడించింది. తొమ్మిదో స్థానంలో ధీరజ్ బుధవారం జరిగిన రికర్వ్ విభాగం పురుషుల క్వాలిఫయింగ్‌లో భారత ఆర్చర్లు అంతగా ఆకట్టుకోలేకపోయారు. పారిస్ ఒలింపియన్, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ బొమ్మదేవర ధీరజ్ 677 పాయింట్లు స్కోరు చేసి తొమ్మిదో స్థానంలో నిలిచాడు. 666 పాయింట్లతో తరుణ్‌దీప్ రాయ్ 28వ స్థానంలో, 652 పాయింట్లతో అతాను దాస్ 57వ స్థానంలో, 651 పాయింట్లతో పార్థ్ సాలుంఖే 60వ స్థానంలో నిలిచారు. ఓవరాల్‌గా 1995 పాయింట్లు స్కోరు చేసి ఏడో స్థానంలో నిలిచిన భారత్‌కు తొలి రౌండ్లో ‘బై’ లభించింది.రికర్వ్ విభాగం మహిళల క్వాలిఫయింగ్‌లో భారత స్టార్ దీపిక కుమారి 655 పాయింట్లు సాధించి 12వ స్థానాన్ని దక్కించుకుంది. 652 పాయింట్లతో అంకిత 17వ స్థానంలో, 642 పాయింట్లతో అన్షిక 29వ స్థానంలో, 637 పాయింట్లతో సిమ్రన్‌జిత్ కౌర్ 39వ స్థానంలో నిలిచారు. ఓవరాల్‌గా 1949 పాయింట్లతో భారత్ మూడో స్థానంలో నిలిచిన భారత్‌కు తొలి రౌండ్లో ‘బై’ దక్కింది. -
ప్రపంచకప్ ఆర్చరీ టోర్నమెంట్: ధీరజ్ బృందానికి రజత పతకం
సెంట్రల్ ఫ్లోరిడా (అమెరికా): ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–1 టోర్నమెంట్లో పురుషుల రికర్వ్ టీమ్ విభాగంలో భారత జట్టుకు రజత పతకం లభించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బొమ్మదేవర ధీరజ్, అతాను దాస్, తరుణ్‌దీప్ రాయ్‌లతో కూడిన భారత జట్టు 1–5 సెట్ల తేడాతో లీ జాంగ్యువాన్, కావో వెన్‌చావో, వాంగ్ యాన్లతో కూడిన చైనా జట్టు చేతిలో ఓడిపోయింది. తొలి సెట్లో రెండు జట్లు 54–54తో సమంగా నిలిచి చెరో పాయింట్ దక్కించుకున్నాయి. రెండో సెట్‌ను చైనా 58–55తో నెగ్గి 3–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత మూడో సెట్‌ను చైనా 55–54తో సొంతం చేసుకొని 5–1తో స్వర్ణ పతకాన్ని ఖరారు చేసుకుంది. ఆర్చరీ సీజన్ తొలి టోర్నీలో ఇప్పటి వరకు భారత్‌కు మూడు పతకాలు లభించాయి. -
జ్యోతి సురేఖ జోడీ పసిడి గురి
సెంట్రల్ ఫ్లోరిడా: ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–1 టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ పసిడి వెలుగులు విరజిమ్మింది. శనివారం కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో జ్యోతి సురేఖ–రిషభ్ యాదవ్ (భారత్) జోడీ 153–151 పాయింట్ల తేడాతో హువాంగ్ ఐజు–చెన్ చియె లున్ (చైనీస్ తైపీ) ద్వయంపై విజయం సాధించింది. తుదిపోరులో ఐదో సీడ్‌గా బరిలోకి దిగిన భారత జోడీ... రెండో సీడ్ చైనీస్ తైపీని వెనక్కినెడుతూ స్వర్ణం కైవసం చేసుకుంది. తొలి రెండు సిరీస్‌లను 37–38, 38–39తో కోల్పోయిన భారత ఆర్చర్లు... మూడో సెట్లో 39–38తో తిరిగి పోటీలోకి వచ్చారు. నాలుగో సిరీస్‌లో 39–36తో సునాయాసంగా నెగ్గి పసిడి పతకం చేజిక్కించుకున్నారు. 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో ఆర్చరీ కాంపౌండ్ విభాగాన్ని చేర్చిన అనంతరం ఈ విజయం విశ్వక్రీడల్లో భారత పతక ఆశలను మరింత పెంచింది. ఈ టోర్నీలో భారత్‌కు ఇది మూడో పతకం కావడం విశేషం. అంతకుముందు కాంపౌండ్ పురుషుల టీమ్ ఈవెంట్లో భారత జట్టు కాంస్య పతకం నెగ్గగా... రికర్వ్ పురుషుల టీమ్ ఈవెంట్లో భారత జట్టు ఫైనల్‌కు చేరి కనీసం రజత పతకం ఖాయం చేసుకుంది. -
ధీరజ్‌కు రెండు కాంస్యాలు
అంటాల్యా (టర్కీ): ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–3 టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ బొమ్మదేవర ధీరజ్ రెండు కాంస్య పతకాలు సాధించాడు. మిక్స్డ్ టీమ్ కాంస్య పతక మ్యాచ్‌లో ధీరజ్–భజన్ కౌర్ (భారత్) ద్వయం 5–3తో మటియాస్–వలెన్సియా (మెక్సికో) జోడీపై గెలిచింది. వ్యక్తిగత విభాగం కాంస్య పతక మ్యాచ్‌లో ధీరజ్ 7–3 తో మౌరో నెస్పోలి (ఇటలీ)పై విజయం సాధించాడు. -
భారత మహిళల జట్టు ‘హ్యాట్రిక్’
అంటాల్యా (టర్కీ): వరల్డ్ కప్ ఆర్చరీ స్టేజ్ 3లో భారత మహిళల జట్టు (కాంపౌండ్ విభాగం) స్వర్ణ పతకం గెలుచుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో భారత్ 232–229 స్కోరుతో ఎస్తోనియాపై విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖతో పాటు అదితి గోపీచంద్ స్వామి, పర్నిత్ కౌర్ ఈ జట్టులో సభ్యులుగా ఉన్నారు. తుది పోరులో 4 ఎండ్లలో భారత్ వరుసగా 58, 57, 59, 58 పాయింట్లు సాధించగా...ఎస్తోనియా టీమ్ సభ్యులు వరుసగా 57, 57, 58, 57 స్కోర్లు చేసి ఓవరాల్‌గా 3 పాయింట్లతో వెనుకబడ్డారు. మన మహిళల జట్టు ఈ ఏడాది వరుసగా మూడో వరల్డ్ కప్‌లోనూ పసిడి పతకం గెలుచుకొని సత్తా చాటడం విశేషం. వరల్డ్ కప్ స్టేజ్ 1 (షాంఘై), వరల్డ్ కప్ స్టేజ్ 2 (యెజియాన్)లలో కూడా టీమ్ అగ్రస్థానంతో ముగించింది. మరో వైపు పురుషుల కాంపౌండ్ విభాగం ఫైనల్లో ఓడిన భారత ఆర్చర్ ప్రియాన్‡్ష రజత పతకాన్ని గెలుచుకున్నాడు. ఫైనల్లో ప్రియాన్‡్ష 148–149 స్కోరుతో మైక్ స్కాలెసర్ చేతిలో ఓటమిపాలయ్యాడు. -
రెండు పతకాలపై ధీరజ్ గురి
అంటాల్యా (టర్కీ): ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–3 టోర్నీ పురుషుల రికర్వ్ విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ బొమ్మదేవర ధీరజ్ రెండు పతకాల రేసులో నిలిచాడు. రికర్వ్ మిక్స్డ్ విభాగంలో భజన్ కౌర్‌తో కలిసి ధీరజ్ ఆదివారం కాంస్య పతకం కోసం పోటీపడనున్నాడు. దాంతోపాటు పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగంలోనూ ధీరజ్ సెమీఫైనల్ చేరుకున్నాడు. వ్యక్తిగత విభాగం క్వార్టర్ ఫైనల్లో ధీరజ్ 7–3 (28–29, 28–27, 29–29, 28–27, 30–27)తో వెటెర్ (జర్మనీ)పై గెలిచాడు. మిక్స్డ్ విభాగం సెమీఫైనల్లో ధీరజ్–భజన్ కౌర్ ద్వయం 3–5 (37–34, 36–38, 37–37, 36–38)తో జెన్ హన్‌యంగ్–లీ వూసియోక్ (కొరియా) జంట చేతిలో ఓడింది. -
‘మిక్స్డ్’ ఫైనల్లో సురేఖ–అభిషేక్ జోడీ
షాంఘై (చైనా): ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–1 టోర్నీలో భారత ఆర్చర్ల జోరు కొనసాగుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ–అభిషేక్ వర్మ (భారత్) జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో జ్యోతి సురేఖ–అభిషేక్ ద్వయం 155–151తో బెసెరా–మెండెజ్ (మెక్సికో) జంటను ఓడించింది. రికర్వ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ బొమ్మదేవర ధీరజ్–అంకిత (భారత్) జోడీ కాంస్య పతకం కోసం పోటీపడనుంది. సెమీఫైనల్లో ధీరజ్ –అంకిత 0–6తో లిమ్ సిహైన్–కిమ్ వూజిన్ (కొరియా) చేతిలో ఓడిపోయారు. రికర్వ్ వ్యక్తిగత విభాగంలో ధీరజ్ మూడో రౌండ్లో 4–6 తో కెన్ సాంచెజ్ (స్పెయిన్) చేతిలో ఓటమి చవిచూశాడు. భారత్‌కే చెందిన తరుణ్‌దీప్ రాయ్ క్వార్టర్ ఫైనల్లో 3–7తో టెమినో (స్పెయిన్) చేతిలో పరాజయం పాలయ్యాడు. మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో భారత స్టార్ దీపిక కుమారి క్వార్టర్ ఫైనల్లో 6–4తో జెన్ హన్‌యంగ్ (కొరియా)పై నెగ్గి సెమీఫైనల్ చేరింది. -
పసిడి పోరుకు ధీరజ్ బృందం
షాంఘై (చైనా): ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–1 టోర్నమెంట్ పురుషుల రికర్వ్ టీమ్ విభాగంలో భారత జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్, తరుణ్‌దీప్ రాయ్, ప్రవీణ్ జాధవ్‌లతో కూడిన భారత బృందం గురువారం జరిగిన సెమీఫైనల్లో 5–1 (55–54, 55–55, 56–55)తో ఇటలీ జట్టును ఓడించింది. ఆదివారం జరిగే ఫైనల్లో ప్రస్తుత ప్రపంచ, ఒలింపిక్ చాంపియన్ జట్టు దక్షిణ కొరియాతో టీమిండియా తలపడుతుంది.తొలి రౌండ్లో ‘బై’ పొందిన భారత జట్టు రెండో రౌండ్లో 5–3 (55–56, 54–54, 55–51, 55–53)తో ఇండోనేసియాపై, క్వార్టర్ ఫైనల్లో 5–1 (59–54, 56–55, 55–55)తో స్పెయిన్‌పై విజయం సాధించింది. దీపిక కుమారి, అంకిత, భజన్ కౌర్‌లతో కూడిన భారత మహిళల రికర్వ్ జట్టు కథ రెండో రౌండ్లోనే ముగిసింది. రెండో రౌండ్లో భారత్ 3–5 (50–50, 55–49, 51–54, 52–54)తో మెక్సికో జట్టు చేతిలో ఓడిపోయింది. సెమీఫైనల్లో జ్యోతి సురేఖ కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో భారత ఆర్చర్లు వెన్నం జ్యోతి సురేఖ, ప్రియాంశ్ సెమీఫైనల్లోకి ప్రవేశించారు. ఆంధ్రఫ్రదేశ్ అమ్మాయి, ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత జ్యోతి సురేఖ రెండో రౌండ్లో 147–145తో యువా బేగమ్ (టర్కీ)పై, మూడో రౌండ్లో 148–147తో ఆండ్రియా మునోజ్ (స్పెయిన్)పై, క్వార్టర్ ఫైనల్లో 143–142తో అవనీత్ కౌర్ (భారత్)పై గెలుపొందింది.భారత్‌కే చెందిన ప్రపంచ చాంపియన్ అదితి క్వార్టర్ ఫైనల్లో 142–144తో ఆండ్రియా బెసెరా (మెక్సికో) చేతిలో ఓడిపోయింది. పురుషుల క్వార్టర్ ఫైనల్లో ప్రియాంశ్ 145–145 (10/9)తో ‘షూట్ ఆఫ్’లో బతుహాన్ (టర్కీ)పై నెగ్గాడు. భారత్‌కే చెందిన అభిషేక్ వర్మ, రజత్ చౌహాన్ తొలి రౌండ్లో... ప్రథమేశ్ క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయారు. -
ఆర్చరీలో ‘డబుల్’ ధమాకా
పారిస్: భారత ఆర్చర్లు ప్రపంచకప్ స్టేజ్–4 ఈవెంట్లో పసిడి పంట పండించారు. కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో భారత పురుషుల, మహిళల జట్లు స్వర్ణ పతకాలతో ‘డబుల్’ ధమాకా సాధించాయి. రికర్వ్ జట్లు కాంస్య పతకాలు గెలిచాయి. పురుషుల కాంపౌండ్ ఈవెంట్లో అభిషేక్ వర్మ, ఓజస్ ప్రవీణ్, ప్రథమేశ్ జౌకర్‌లతో కూడిన భారత జట్టు శని వారం జరిగిన ఫైనల్లో 236–232 స్కోరుతో క్రిస్ షాఫ్, జేమ్స్ లుజ్, సాయెర్ సలైవాన్‌లతో కూడిన అమెరికా జట్టుపై ఘన విజయం సాధించింది. మూడు రౌండ్లు ముగిసేసరికి ఇరు జట్లు సమంగా నిలవగా, కీలకమైన చివరి రౌండ్లో భారత్ పైచే యి సాధించింది. పురుషుల రికర్వ్ టీమ్ విభాగంలో సెమీస్‌లో ఓడిన భారత జట్టు కాంస్య పతక పోరులో స్పెయిన్ టీమ్‌పై గెలిచింది. ధీరజ్ బొమ్మదేవర, అతాను దాస్, తుషార్‌లతో కూడిన భారత్ 6–2తో స్పానిష్ టీమ్‌ను ఓడించి కాంస్యం గెలుచుకుంది. మహిళల రికర్వ్ టీమ్ విభాగంలో భజన్ కౌర్, అంకిత భకత్, సిమ్రాన్‌జీత్ కౌర్‌లు ఉన్న భారత త్రయం కాంస్య పతక పోరులో 5–4తో మెక్సికో జట్టుపై గెలిచింది. అమ్మాయిల జట్టు పైచేయి మహిళల కాంపౌండ్‌లో జ్యోతి సురేఖ, అదితి గోపీచంద్, పర్నీత్ కౌర్‌లతో కూడిన భారత బృందం 234–233తో మెక్సికో జట్టుపై గెలిచి పసిడి పతకం చేజిక్కించుకుంది. తొలి రౌండ్లో 59–59తో అండ్రియా బెకెరా, అనా సోఫియా, డాఫ్నే క్వింటెరోలతో కూడిన మెక్సికో జట్టుతో భారత్ స్కోరు సమంచేసింది. రెండో రౌండ్లో 59–58తో స్వల్ప ఆధిక్యం కనబరిచింది. 118–117 తో మూడో రౌండ్లోకి దిగిన భారత ఆర్చర్లు 57–59తో వెనుకబడ్డారు. 175–176తో ఆధిక్యం మెక్సికోవైపు మళ్లింది. ఈ దశలో నాలుగో రౌండ్‌పై దృష్టిపెట్టిన ఆర్చర్లు 59 స్కోరు చేస్తే... మెక్సికన్ అమ్మాయిలు 57 స్కోరే చేయడంతో పాయింట్ తేడాతో భారత్ (234–233) స్వర్ణ పతకం గెలుపొందింది. జ్యోతి సురేఖ @ 50 ఆంధ్రప్రదేశ్ స్టార్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ అంతర్జాతీయ పోటీల్లో పతకాల ఫిఫ్టీ పూర్తి చేసుకుంది. ఈ టోర్నీకి ముందు 48 పతకాలు సాధించిన ఆమె శనివారం కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో స్వర్ణం సాధించింది. అనంతరం వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం గెలుచుకోవడంతో 50వ పతకం ఆమె ఖాతాలో చేరింది. సెమీస్‌లో ఓడిన ఆమె మూడో స్థానం కోసం కొలంబియాకు చెందిన సారా లోపెజ్‌తో తలపడింది. స్కోరు 146–146తో సమం కాగా, షూటాఫ్‌లోనూ 10–10తో సమంగా నిలిచారు. అయితే లక్ష్యబిందువుకు అతి సమీపంగా కచ్చితత్వంతో కూడిన బాణాలు సంధించిన జ్యోతినే విజేతగా ప్రకటించడంతో కాంస్యం లభించింది. జ్యోతి సురేఖ వివిధ అంతర్జాతీయ టోర్నీల్లో కలిపి గెలిచిన మొత్తం 50 పతకాల్లో 17 స్వర్ణాలు, 18 రజతాలు, 15 కాంస్యాలున్నాయి. -
భారత్ గురికి రెండు కాంస్యాలు
పారిస్: ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–4 టోర్నీలో రెండో రోజూ భారత్ ఖాతాలో రెండు పతకాలు చేరాయి. తొలి రోజు బుధవారం కాంపౌండ్ టీమ్ విభాగంలో భారత పురుషుల, మహిళల జట్లు ఫైనల్ చేరి కనీసం రెండు రజతాలు ఖరారు చేసుకోగా... గురువారం రికర్వ్ టీమ్ విభాగంలో భారత పురుషుల, మహిళల జట్లు మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాలు సొంతం చేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు బొమ్మదేవర ధీరజ్‌తోపాటు అతాను దాస్, తుషార్ ప్రభాకర్ షెలే్కలతో కూడిన భారత పురుషుల జట్టు కాంస్య పతక మ్యాచ్‌లో 6–2తో (54–56, 57–55, 56–54, 57–55) స్పెయిన్ జట్టుపై గెలుపొందింది. సెమీఫైనల్లో భారత్ 0–6తో (54–56, 47–58, 55–56) చైనీస్ తైపీ జట్టు చేతిలో ఓడిపోయి కాంస్య పతకం కోసం పోటీపడింది. రికర్వ్ ఈవెంట్లో మ్యాచ్‌లను ‘బెస్ట్ ఆఫ్ ఫోర్ సెట్స్’ పద్ధతిలో మ్యాచ్‌ను నిర్వహిస్తారు. సెట్ గెలిచిన జట్టుకు రెండు పాయింట్లు లభిస్తాయి. స్కోరు సమంగా నిలిస్తే రెండు జట్లకు ఒక్కో పాయింట్ వస్తుంది. నాలుగు సెట్ల తర్వాత స్కోరు సమమైతే ‘షూట్ ఆఫ్’ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. మహిళల టీమ్ రికర్వ్ కాంస్య పతక మ్యాచ్‌లో అంకిత, భజన్ కౌర్, సిమ్రన్‌జిత్ కౌర్‌లతో కూడిన భారత జట్టు ‘షూట్ ఆఫ్’లో 5–4తో (52–55, 52–53, 55–52, 54–52, 27–25) మెక్సికో జట్టును ఓడించింది. నాలుగు సెట్ల తర్వాత రెండు జట్లు 4–4తో సమంగా నిలిచాయి. విజేతను నిర్ణయించేందుకు ‘షూట్ ఆఫ్’ నిర్ణయించగా... భారత బృందం 27 పాయింట్లు స్కోరు చేయగా... మెక్సికో జట్టు 25 పాయింట్లు చేసి ఓడిపోయింది. అంతకుముందు సెమీఫైనల్లో భారత్ 0–6తో (52–57, 47–56, 52–53) చైనీస్ తైపీ జట్టు చేతిలో ఓడిపోయి కాంస్య పతకం కోసం ఆడింది. సెమీఫైనల్లో జ్యోతి సురేఖ మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో ఆంధ్రప్రదేశ్ స్టార్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ సెమీఫైనల్లోకి దూసుకెళ్లి పతకం రేసులో నిలిచింది. సురేఖ తొలి రౌండ్లో 145–131తో పూన్ చియు యి (హాంకాంగ్)పై, రెండో రౌండ్లో 148–145తో చెన్ లి జు (చైనీస్ తైపీ)పై, మూడో రౌండ్లో 148–145తో హువాంగ్ జు (చైనీస్ తైపీ)పై, క్వార్టర్ ఫైనల్లో 147–144తో డాఫ్నీ క్వింటెరో (మెక్సికో)పై నెగ్గింది. శనివారం జరిగే సెమీఫైనల్లో ఎల్లా గిబ్సన్ (బ్రిటన్)తో సురేఖ ఆడుతుంది. ప్రపంచ చాంపియన్, భారత ప్లేయర్ అదితి క్వార్టర్ ఫైనల్లో 135–148తో ఎల్లా గిబ్సన్ చేతిలో ఓడింది. -
World Cup Archery: సురేఖ జోడీకి స్వర్ణం
World Cup Archery- షాంఘై: వరల్డ్ కప్ ఆర్చరీ స్టేజ్–2 (కాంపౌండ్ విభాగం)లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ సత్తా చాటింది. మిక్స్డ్ డబుల్స్‌లో ఆమె స్వర్ణపతకాన్ని సొంతం చేసుకుంది. సురేఖ– ఓజస్ ప్రవీణ్ దేవ్‌తలే జోడి ఫైనల్లో 156–155 స్కోరు తేడాతో కొరియా జంట కిమ్ జోంగో–ఓహ్యూహ్యూన్ను ఓడించింది. తొలి మూడు ఎండ్లలో ఇరు జట్లు సమంగా పోటీ పడుతూ వరుసగా 39, 39, 39 చొప్పున పాయింట్లు సాధించడంతో స్కోరు 117–117తో సమంగా నిలిచింది. చివరి ఎండ్‌లో భారత ద్వయం 39 పాయింట్లు నమోదు చేయగా...కొరియా 38కే పరిమితమైంది. దాంతో సురేఖ–ఓజస్లకు పసిడి దక్కింది. పురుషుల వ్యక్తిగత కాంపౌండ్ విభాగంలో భారత ఆర్చర్ ప్రథమేశ్ జౌకర్ సంచలనం సృష్టించాడు. ఫైనల్లో ప్రథమేశ్ 149–148తో నెదర్లాండ్స్‌కు చెందిన వరల్డ్ నంబర్‌వన్ మైక్ స్కోసర్పై విజయం సాధించాడు. 19 ఏళ్ల ప్రథమేశ్ కెరీర్లో ఇది రెండో అంతర్జాతీయ టోర్నీ మాత్రమే. మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో భారత్‌కు చెందిన అవనీత్ కౌర్ కాంస్యం గెలుచుకుంది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో అవనీత్ 147–144తో ఐపెక్ తోమ్రుక్ (తుర్కియే)ను ఓడించింది. -
Archery World Cup: కాంస్యం బరిలో అభిషేక్ జోడీ
గ్వాంగ్జు (దక్షిణ కొరియా): ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–2 టోర్నీలో అభిషేక్ వర్మ–అవ్నీత్ కౌర్ (భారత్) జంట కాంస్య పతకం కోసం పోరాడనుంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగం సెమీఫైనల్లో అభిషేక్ వర్మ–అవ్నీత్ కౌర్ జోడీ 156–158 పాయింట్ల తేడాతో లిజెల్ జాట్మా–రాబిన్ జాట్మా (ఎస్తోనియా) ద్వయం చేతిలో ఓడిపోయింది. నేడు జరిగే కాంస్య పతకం మ్యాచ్‌లో బెరా సుజెర్–ఎమిర్కాన్ హనీ (టర్కీ) జంటతో అభిషేక్–అవ్నీత్ తలపడతారు. -
పసిడి పతకంపై గురి
పారిస్: టోక్యో ఒలింపిక్స్ బెర్త్ సంపాదించడంలో విఫలమైన భారత మహిళల రికర్వ్‌జట్టు వరల్డ్‌కప్ ఆర్చరీ స్టేజ్–3 టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో దీపిక కుమారి, అంకిత భకత్, కోమలికలతో కూడిన భారత జట్టు 6–2తో ఆరో ర్యాంకర్ ఫ్రాన్స్ జట్టును ఓడించింది. తొలి సెట్‌ను 57–51తో... రెండో సెట్‌నూ 57–51తో నెగ్గిన భారత జట్టు 4–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే మూడో సెట్‌ను దీపిక బృందం 54–55తో కోల్పోయి ఫ్రాన్స్‌కు రెండు పాయింట్లు కోల్పోయింది. కానీ నాలుగో సెట్లో తేరుకున్న భారత్ 56–54తో గెలిచి ఓవరాల్‌గా 6–2 స్కోరుతో విజయాన్ని దక్కించుకుంది. ఆదివారం జరిగే ఫైనల్లో మెక్సికో జట్టుతో భారత్ తలపడుతుంది. ఏప్రిల్‌లో గ్వాటెమాలా సిటీలో జరిగిన వరల్డ్‌కప్ స్టేజ్–1 టోర్నీలో భారత మెక్సికోను ఓడించి స్వర్ణ పతకాన్ని సాధించింది. తొలి రౌండ్లో ‘బై’ పొందిన భారత జట్టు రెండో రౌండ్లో 6–0తో (59–52; 55–49; 56–52) స్పెయిన్‌ను ఓడించి క్వార్టర్ ఫైనల్ చేరింది. క్వార్టర్ ఫైనల్లో టీమిండియా 6–0తో (54–49; 59–54; 54–51) టర్కీపై విజయం సాధించింది. పురుషుల రికర్వ్ టీమ్ విభాగంలో అతాను దాస్, తరుణ్‌దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్‌లతో కూడిన భారత జట్టు క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించింది. జర్మనీతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 4–5తో ఓడింది. నాలుగు సెట్లు ముగి శాక రెండు జట్టు 4–4తో సమంగా నిలిచాయి. అయితే ‘షూట్ ఆఫ్’లో జర్మనీ 27–26తో భారత్‌ను ఓడించింది. కాంపౌండ్ మహిళల టీమ్ విభాగంలో జ్యోతి సురేఖ, సాంచీ, అక్షతలతో కూడిన భారత జట్టు తొలి రౌండ్లో 225–228తో ఫ్రాన్స్ జట్టు చేతిలో ఓడింది. కాంపౌండ్ పురుషుల టీమ్ విభాగంలో అభిషేక్ వర్మ, అమన్, రజత్ చౌహాన్‌లతో కూడిన భారత జట్టు క్వార్టర్ ఫైనల్లో ‘షూట్ ఆఫ్’లో 25–29తో ఫ్రాన్స్ చేతిలో ఓటమి చవిచూసింది. -
జ్యోతి సురేఖ ఓటమి
బెర్లిన్: ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–4 టోర్నీలో ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ జ్యోతి సురేఖ పోరాటం ముగిసింది. బెర్లిన్‌లో శుక్రవారం జరిగిన మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగం క్వార్టర్ ఫైనల్లో జ్యోతి సురేఖ 145–147తో సారా సోనిషెన్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయింది. -
క్వార్టర్స్‌లో జ్యోతి సురేఖ జంట ఓటమి
బెర్లిన్: ప్రపంచ కప్ ఆర్చరీ స్టేజ్–4 టోర్నమెంట్లో కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత పోరాటం ముగిసింది. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో తెలుగు అమ్మాయి వెన్నెం జ్యోతి సురేఖ–అభిషేక్ వర్మ (భారత్) జంట 149–156 పాయింట్లతో లిండా అండర్సన్–జూలియో ఫిరో (మెక్సికో) ద్వయం చేతిలో ఓడిపోయింది. అంతకుముందు జరిగిన తొలి రౌండ్లో సురేఖ–అభిషేక్ జోడీ 154–149తో లూసీ మేసన్–కార్ల్ రిచర్డ్స్ (బ్రిటన్) జంటపై విజయం సాధించింది. మహిళల టీమ్ కాంపౌండ్ క్వాలిఫయింగ్‌లో జ్యోతి సురేఖ, త్రిషా దేబ్, స్నేహల్లతో కూడిన భారత జట్టు 2,069 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. దక్షిణాఫ్రికా, ఫ్రాన్స్ జట్ల మధ్య మ్యాచ్ విజేతతో భారత్ తలపడుతుంది. క్వాలిఫయింగ్ వ్యక్తిగత విభాగంలో జ్యోతి సురేఖ ఐదో ర్యాంక్‌లో నిలిచి నేరుగా మూడో రౌండ్‌కు అర్హత పొందింది. -
అభిషేక్–దివ్య జంటకు కాంస్యం
ప్రపంచకప్ ఆర్చరీ అంటాల్యా (టర్కీ): ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–2 టోర్నమెంట్లో కాంపౌండ్ మిక్స్డ్ ఈవెంట్లో అభిషేక్ వర్మ, దివ్య దయాళ్లతో కూడిన భారత జోడీ కాంస్య పతకాన్ని గెలిచింది. అభిషేక్ వర్మ–దివ్య దయాళ్ ద్వయం 154–153తో సెర్గియో పాగ్ని–మార్సెల్లా టోనియోలి (ఇటలీ) జంటపై గెలిచింది. టీమ్ విభాగంలో అభిషేక్ వర్మ, చిన్నరాజు శ్రీధర్, గుర్విందర్ సింగ్‌లతో కూడిన భారత పురుషుల జట్టు 227–228తో ఒక్క పాయింట్ తేడాతో ఫ్రాన్స్ చేతిలో... తెలుగు అమ్మాయి జ్యోతి సురేఖ, దివ్య దయాళ్, స్నేహల్లతో కూడిన భారత మహిళల జట్టు 222–227తో ఇటలీ చేతిలో ఓడిపోయి కాంస్య పతకాలను చేజార్చుకున్నాయి. -
భారత్ ‘పసిడి గురి’
వ్రోక్లా (పోలాండ్): భారత మహిళా ఆర్చర్లు అద్భుతం చేశారు. ప్రపంచ కప్‌లో వరుసగా రెండోసారి జయకేతనం ఎగురవేశారు. ఆదివారం జరిగిన టీమ్ రికర్వ్ విభాగంలో ఫైనల్లో దీపిక కుమారి, రిమిల్, బొంబేలా దేవిలతో కూడిన భారత బృందం 219-215తో ప్రపంచ నంబర్‌వన్, లండన్ ఒలింపిక్స్ చాంపియన్ దక్షిణ కొరియాను బోల్తా కొట్టించింది. గత నెలలో కొలంబియాలో జరిగిన ప్రపంచ కప్‌లోనూ టీమిండియాకు బంగారు పతకం లభించింది. ఆరు బాణాల చొప్పున తొలి మూడు రౌండ్లు పూర్తయ్యాక భారత్, కొరియా 163-163 పాయింట్లతో సమఉజ్జీగా నిలిచాయి. చివరి రౌండ్లో కొరియా ఆర్చర్లు వరుసగా 6, 10, 9, 9, 8, 10... భారత ఆర్చర్లు వరుసగా 9, 10, 10, 10, 10, 7 పాయింట్లు నమోదు చేశారు. దాంతో భారత్ నాలుగు పాయింట్ల తేడాతో నెగ్గింది.