క్వార్టర్స్‌లో జ్యోతి సురేఖ జంట ఓటమి | Jyothi Surekha lost in quarterfinals | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో జ్యోతి సురేఖ జంట ఓటమి

Aug 10 2017 12:46 AM | Updated on Sep 17 2017 5:21 PM

క్వార్టర్స్‌లో జ్యోతి సురేఖ జంట ఓటమి

క్వార్టర్స్‌లో జ్యోతి సురేఖ జంట ఓటమి

ప్రపంచ కప్‌ ఆర్చరీ స్టేజ్‌–4 టోర్నమెంట్‌లో కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో భారత పోరాటం ముగిసింది.

బెర్లిన్‌: ప్రపంచ కప్‌ ఆర్చరీ స్టేజ్‌–4 టోర్నమెంట్‌లో కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో భారత పోరాటం ముగిసింది. బుధవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో తెలుగు అమ్మాయి వెన్నెం జ్యోతి సురేఖ–అభిషేక్‌ వర్మ (భారత్‌) జంట 149–156 పాయింట్లతో లిండా అండర్సన్‌–జూలియో ఫిరో (మెక్సికో) ద్వయం చేతిలో ఓడిపోయింది. అంతకుముందు జరిగిన తొలి రౌండ్‌లో సురేఖ–అభిషేక్‌ జోడీ 154–149తో లూసీ మేసన్‌–కార్ల్‌ రిచర్డ్స్‌ (బ్రిటన్‌) జంటపై విజయం సాధించింది.

మహిళల టీమ్‌ కాంపౌండ్‌ క్వాలిఫయింగ్‌లో జ్యోతి సురేఖ, త్రిషా దేబ్, స్నేహల్‌లతో కూడిన భారత జట్టు 2,069 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి నేరుగా క్వార్టర్‌ ఫైనల్‌కు అర్హత సాధించింది. దక్షిణాఫ్రికా, ఫ్రాన్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ విజేతతో భారత్‌ తలపడుతుంది. క్వాలిఫయింగ్‌ వ్యక్తిగత విభాగంలో జ్యోతి సురేఖ ఐదో ర్యాంక్‌లో నిలిచి నేరుగా మూడో రౌండ్‌కు అర్హత పొందింది. 

Advertisement
 
Advertisement
Advertisement