మరో పతకం రేసులో ధీరజ్‌ | Dheeraj in the semifinals of the World Cup Archery Stage 3 tournament | Sakshi
Sakshi News home page

మరో పతకం రేసులో ధీరజ్‌

Jun 13 2026 3:19 AM | Updated on Jun 13 2026 3:19 AM

Dheeraj in the semifinals of the World Cup Archery Stage 3 tournament

అంటాల్యా: ప్రపంచకప్‌ ఆర్చరీ స్టేజ్‌–3 టోర్నమెంట్‌లో భారత్‌ కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ఆర్చర్‌ బొమ్మదేవర ధీరజ్‌ రెండో పతకం రేసులో నిలిచాడు. పురుషుల రికర్వ్‌ వ్యక్తిగత విభాగంలో ధీరజ్‌ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో ధీరజ్‌ 6–2 (29–29, 28–28, 29–30, 29–28, 29–28) సెట్‌లతో మాసిమిలానో మాండియా (ఇటలీ)పై గెలిచాడు. ఆదివారం జరిగే సెమీఫైనల్లో మోరిట్జ్‌ వీసెర్‌ (జర్మనీ)తో ధీరజ్‌ తలపడతాడు. సెమీఫైనల్లో ధీరజ్‌ ఓడిపోతే కాంస్యం కోసం పోటీపడతాడు. 

సెమీస్‌లో నెగ్గితే స్వర్ణ, రజత పతకాల రేసులో ఉంటాడు. మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో ధీరజ్‌–కుంకుమ్‌ జోడీ ఫైనల్‌కు చేరింది. మరోవైపు పురుషుల, మహిళల కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ ప్లేయర్లు వెన్నం జ్యోతి సురేఖ, తిరుమూరు గణేశ్‌ మణిరత్నం నిరాశపరిచారు. మూడో రౌండ్‌లో జ్యోతి సురేఖ 144–146తో టాంజా జెలెన్‌థిన్‌ (డెన్మార్క్‌), గణేశ్‌ 143–147తో నికో వీనెర్‌ (ఆ్రస్టియా) చేతిలో ఓటమి పాలయ్యారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement