ఢిల్లీకి పంత్‌.. ఐపీఎల్‌లో ఖరీదైన ట్రేడ్లు ఇవే..! | Costliest Trades In IPL History | Sakshi
Sakshi News home page

ఢిల్లీకి పంత్‌.. ఐపీఎల్‌లో ఖరీదైన ట్రేడ్లు ఇవే..!

Jun 23 2026 5:56 PM | Updated on Jun 23 2026 6:06 PM

Costliest Trades In IPL History

ఐపీఎల్‌లో ఆటగాళ్ల వేలం ఎంత ఆసక్తికరంగా ఉంటుందో, ట్రేడ్‌ డీల్స్‌ కూడా అంతే సంచలనంగా మారుతుంటాయి. జట్ల అవసరాలకు అనుగుణంగా స్టార్‌ ఆటగాళ్లను భారీ మొత్తాలకు ట్రేడ్‌ చేసుకోవడం గత కొన్నేళ్లుగా తరచూ కనిపిస్తోంది. తాజాగా రిషబ్‌ పంత్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌కు తిరిగి రావడం, కుల్దీప్‌ యాదవ్‌ లక్నో సూపర్‌ జెయింట్స్‌కు వెళ్లడం మరో భారీ ట్రేడ్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌లో జరిగిన టాప్‌-5 ఖరీదైన ట్రేడ్లపై ఓ లుక్కేద్దాం.  

5. కుల్దీప్‌ యాదవ్‌ (DC → LSG) – ₹13.25 కోట్లు
ఐపీఎల్‌ 2027కు ముందు జరిగిన ట్రేడ్‌లో కుల్దీప్‌ యాదవ్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ను వీడి లక్నో సూపర్‌ జెయింట్స్‌లో చేరాడు. ఐదేళ్ల పాటు ఢిల్లీ తరఫున ఆడి 72 వికెట్లు తీసిన అతడు, ₹13.25 కోట్ల ఒప్పందంతో కొత్త జట్టులోకి వెళ్లాడు.

4. రవీంద్ర జడేజా (CSK → RR) – ₹14 కోట్లు
రవీంద్ర జడేజా 2026 సీజన్‌కు ముందు చెన్నై సూపర్‌ కింగ్స్‌ నుంచి రాజస్థాన్‌ రాయల్స్‌కు ట్రేడ్‌ అయ్యాడు. ఇందుకు గానూ జడేజా ఫీజు ₹14 కోట్లుగా నిర్ణయించారు.

3. హార్దిక్‌ పాండ్యా (GT → MI) – ₹15 కోట్లు
హార్దిక్‌ పాండ్యా 2024 సీజన్‌కు ముందు గుజరాత్‌ టైటాన్స్‌ నుంచి ముంబై ఇండియన్స్‌కు ట్రేడ్‌ అయ్యాడు. ఈ డీల్‌ విలువ ₹15 కోట్లు. దీనికి అదనంగా గుజరాత్‌కు ప్రత్యేక ట్రాన్స్‌ఫర్‌ ఫీజు కూడా చెల్లించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

3. రిషభ్‌ పంత్‌ (LSG → DC) – ₹15 కోట్లు
లక్నో సూపర్‌ జెయింట్స్‌ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌కు తిరిగి చేరిన పంత్‌ ట్రేడ్‌ విలువ ₹15 కోట్లు. గతంలో ₹27 కోట్ల రికార్డు ఒప్పందంతో LSGలో చేరిన పంత్‌, ఇప్పుడు తగ్గిన మొత్తంతో తన పాత జట్టులోకి వచ్చాడు.

2. కామెరూన్‌ గ్రీన్‌ (MI → RCB) – ₹17.5 కోట్లు
కెమరూన్‌ గ్రీన్‌ ముంబై ఇండియన్స్‌ నుంచి ఆర్సీబీకి ₹17.5 కోట్లకు ట్రేడ్‌ అయ్యాడు. ఐపీఎల్‌ చరిత్రలో అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడి ట్రేడ్‌ ఇదే.

1. సంజూ శాంసన్‌ (RR → CSK) – ₹18 కోట్లు
సంజూ శాంసన్‌ రాజస్థాన్‌ రాయల్స్‌ నుంచి చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ₹18 కోట్ల భారీ డీల్‌తో ట్రేడ్‌ అయ్యాడు. ఈ ఒప్పందంలో జడేజా, సామ్‌ కర్రన్‌ రాజస్థాన్‌కు వెళ్లారు. ఐపీఎల్‌ చరిత్రలో ఇప్పటివరకు ఇదే అత్యంత ఖరీదైన ట్రేడ్‌గా నిలిచింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement