సెమీస్‌లో బోపన్న జోడీ  | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో బోపన్న జోడీ 

Published Fri, Oct 13 2023 3:43 AM

Bopanna pair in semis - Sakshi

న్యూఢిల్లీ: షాంఘై ఓపెన్‌ ఏటీపీ మాస్టర్స్‌–1000 టెన్నిస్‌ టోర్నీ లో రోహన్‌ బోపన్న (భారత్‌)–ఎబ్డెన్‌ (ఆ్రస్టేలియా) జోడీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. చైనాలో గురువారం జరిగిన పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్‌ ద్వయం 6–4, 6–2తో అరెవాలో (ఎల్‌సాల్వడార్‌)–జీన్‌ జూలియన్‌ రోజర్‌ (నెదర్లాండ్స్‌) జంటపై గెలిచింది. 61 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న జోడీ పది ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్‌ చేసింది.  

Advertisement
Advertisement