బాసెల్: స్విస్ ఇండోర్స్ బాసెల్ ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న (భారత్)–బెన్ షెల్టన్ (అమెరికా) జోడీకి నిరాశ ఎదురైంది. సెమీఫైనల్లో బోపన్నషెల్టన్ ద్వయం 6–7 (2/7), 5–7తో ఆడమ్ పావ్లాసెక్ (చెక్ రిపబ్లిక్)–జాన్ జిలిన్‌స్కీ (పోలాండ్) జంట చేతిలో ఓడిపోయింది. 86 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఇండో–అమెరికన్ జోడీ ఐదు ఏస్‌లు సంధించింది.
తమ సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఒకసారి బ్రేక్ చేసింది. సెమీస్‌లో ఓడిన బోపన్నషెల్టన్‌లకు 41,820 (రూ. 42 లక్షల 65 వేలు) యూరోల ప్రైజ్‌మనీతోపాటు 180 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
ఈ టోర్నీలో టాప్ సీడ్ మార్సెల్ గ్రానోలెర్స్ (స్పెయిన్)–హొరాసియో జెబలాస్ (అర్జెంటీనా) ద్వయం విజేతగా నిలిచింది. ఫైనల్లో గ్రానోలెర్స్–జెబలాస్ 6–2, 7–5తో పావ్లాసెక్–జిలిన్‌స్కీలపై గెలిచి 1,54,980 యూరోల (రూ. 1 కోటీ 58 లక్షలు) ప్రైజ్‌మనీని సొంతం చేసుకున్నారు.


