రష్మిక సంచలనం  | Bhamidipati Srivalli Rashmika created a sensation | Sakshi
Sakshi News home page

రష్మిక సంచలనం 

Feb 4 2024 3:54 AM | Updated on Feb 4 2024 3:54 AM

Bhamidipati Srivalli Rashmika created a sensation - Sakshi

ముంబై ఓపెన్‌ డబ్ల్యూటీఏ–125 టెన్నిస్‌ టోర్నీలో హైదరాబాద్‌ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక సంచలనం సృష్టించింది. ముంబైలో శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వాలిఫయింగ్‌ తొలి రౌండ్‌లో ప్రపంచ 374వ ర్యాంకర్‌ రష్మిక 6–3, 6–2తో ప్రపంచ 117వ ర్యాంకర్‌ వాలెంటిని గ్రామటికోపులు (గ్రీస్‌)ను బోల్తా కొట్టించింది. మొర్వాయోవా (స్లొవేకియా)తో నేడు జరిగే క్వాలిఫయింగ్‌ రెండో మ్యాచ్‌లో రష్మిక గెలిస్తే మెయిన్‌ ‘డ్రా’కు అర్హత సాధిస్తుంది.   
 

Advertisement
 
Advertisement
Advertisement