AUSW VS IREW 2nd ODI: Kim Garth Creates An Unique Record After Playing Against Ireland - Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన ఆసీస్‌ ప్లేయర్‌.. తనతో పాటు తల్లి, తండ్రి, సోదరుడు ఆడిన దేశంపైనే..!

Jul 26 2023 9:22 AM | Updated on Jul 26 2023 10:29 AM

AUSW VS IREW 2nd ODI: Kim Garth Creates An Unique Record After Playing Against Ireland - Sakshi

మహిళల క్రికెట్‌లో 27 ఏళ్ల ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌ కిమ్‌ గార్త్‌ చరిత్ర సృష్టించింది. తనతో పాటు తల్లి, తండ్రి, సోదరుడు ప్రాతినిధ్యం వహించిన దేశంపైనే వన్డే మ్యాచ్‌ ఆడి రికార్డుల్లోకెక్కింది. 2010 నుంచి 2019 వరకు ఐర్లాండ్‌కు ఆడిన కిమ్‌.. నిన్న (జులై 25) అదే ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించి, చరిత్ర పుటల్లోకెక్కింది.

ఓ క్రికెటర్‌ రెండు దేశాలకు ప్రాతినిధ్యం వహించడం సాధారణమే అయినప్పటికీ.. తనతో పాటు కుటుంబంలోని నలుగురు క్రికెటర్లు ప్రాతినిధ్యం వహించిన దేశానికి వ్యతిరేకంగా ఆడటం మాత్రం చరిత్రలో ఇదే మొదటిసారి. కిమ్‌ తండ్రి జోనాథన్‌ గార్త్‌, తల్లి అన్నే మేరీ మెక్‌డొనాల్డ్‌, తమ్ముడు జోనాథన్‌ గార్త్‌ ఐర్లాండ్‌ జాతీయ క్రికెట్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. కిమ్‌ వివిధ కారణాల చేత 2022 నుంచి ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు ఆడుతుంది. 

ఇదిలా ఉంటే, ఐర్లాండ్‌తో నిన్న జరిగిన రెండో వన్డేలో ఆసీస్‌ 153 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఫలితంగా 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి వన్డే వర్షం కారణంగా రద్దైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌.. ఎల్లీస్‌ పెర్రీ (91), గార్డ్‌నర్‌ (65), మూనీ (49) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 321 పరుగుల భారీ స్కోర్‌ చేయగా.. ఆతర్వాత బరిలోకి దిగిన ఐర్లాండ్‌ 38.2 ఓవర్లలో 168 పరుగులకు ఆలౌటైంది.

ఐర్లాండ్‌ ఇన్నింగ్స్‌లో యామీ హంటర్‌ (50) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. గాబీ లివిస్‌ (37), కెప్టెన్‌ లారా డెలానీ (18) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. అత్యంత పొదుపుగా బౌలింగ్‌ చేసిన కిమ్‌ గార్తీ (6-2-9-1) ఓ వికెట్‌ పడగొట్టగా.. జార్జీయా వేర్హమ్‌ చెరో 3 వికెట్లు, మెక్‌గ్రాత్‌, జొనాస్సెన్‌ చెరో 2, గార్డనర్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement