నిప్పులు చెరుగుతున్న బ్రాడ్‌.. వరుస బంతుల్లో వార్నర్‌, లబూషేన్‌ ఔట్‌ | Ashes 1st Test: Stuart Broad Dismissed Warner And Labuschagne In Back To Back Deliveries | Sakshi
Sakshi News home page

Ashes Series 2023 1st Test: నిప్పులు చెరుగుతున్న బ్రాడ్‌.. వరుస బంతుల్లో వార్నర్‌, లబూషేన్‌ ఔట్‌

Jun 17 2023 4:54 PM | Updated on Jun 17 2023 5:02 PM

Ashes 1st Test: Stuart Broad Dismissed Warner And Labuschagne In Back To Back Deliveries - Sakshi

యాషెస్‌ సిరీస్‌ తొలి టెస్ట్‌ రెండో రోజు ఆటలో ఇంగ్లండ్‌ వెటరన్‌ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ నిప్పులు చెరుగుతున్నాడు. రెండో రోజు ఏడో ఓవర్‌లో వరుస బంతుల్లో డేవిడ్‌ వార్నర్‌ (9), మార్నస్‌ లబూషేన్‌ (0) వికెట్లు పడగొట్టిన బ్రాడ్‌.. ఆసీస్‌ను దారుణంగా దెబ్బకొట్టాడు. తొలుత వార్నర్‌ను అద్భుతమైన డెలివరీతో క్లీన్‌ బౌల్డ్‌ చేసిన అతను.. ఆతర్వాతి బంతికే లబూషేన్‌ను పెవిలియన్‌కు పంపాడు.

వికెట్ల వెనుక బెయిర్‌స్టో సూపర్‌ క్యాచ్‌తో లబూషేన్‌ ఖేల్‌ ఖతం చేశాడు. ఫలితంగా ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 29 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. యాషెస్‌లో బ్రాడ్‌.. వార్నర్‌ను ఔట్‌ చేయడం ఇది 15వసారి కాగా.. టెస్ట్‌ల్లో లబూషేన్‌ గోల్డన్‌ డకౌట్‌ కావడం​ ఇదే తొలిసారి.

కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ తొలి రోజే ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసి (393/8) సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. జో రూట్‌ (118 నాటౌట్‌) అద్భుతమైన శతకంతో ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ను నిర్మించగా.. జాక్‌ క్రాలే (61), బెయిర్‌స్టో (78) రాణించారు. ఆసీస్‌ బౌలర్లలో నాథన్‌ లయోన్‌ 4, హాజిల్‌వుడ్‌ 2, బోలండ్‌, గ్రీన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. 18 ఓవర్లు ముగిసే సమయానికి ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసింది. ఉస్మాన్‌ ఖ్వాజా (24), స్టీవ్‌ స్మిత్‌ (9) క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్‌ కోల్పోయిన 2 వికెట్లు స్టువర్ట్‌ బ్రాడ్‌ ఖాతాలోకి వెళ్లాయి.

చదవండి: తీరు మారని వార్నర్‌.. మరోసారి బ్రాడ్‌దే పైచేయి! వీడియో వైరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement