Stuart Broad Dismissed David Warner AGAIN in the Ashes for England - Sakshi
Sakshi News home page

Ashes 2023: తీరు మారని వార్నర్‌.. మరోసారి బ్రాడ్‌దే పైచేయి! వీడియో వైరల్‌

Jun 17 2023 4:43 PM | Updated on Jun 17 2023 6:25 PM

Stuart Broad dismisses David Warner AGAIN in the Ashes for England - Sakshi

టెస్టుల్లో ఆస్ట్రేలియా స్టార్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరగుతున్న యాషెస్‌ తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 9 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. టీమిండియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో కూడా డేవిడ్‌ భాయ్‌ ఇదే తీరును కనబరిచాడు.

తీరు మారని వార్నర్‌..
డేవిడ్‌ వార్నర్‌పై మరోసారి ఇంగ్లండ్‌ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ పైచేయి సాధించాడు. అద్భుతమైన బంతితో వార్నర్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. టెస్టుల్లో వార్నర్‌ను బ్రాడ్‌ ఔట్‌ చేయడం 15వసారి కావడం గమనార్హం. టెస్టుల్లో ఓవరాల్‌గా బ్రాడ్‌ బౌలింగ్‌లో 734 బంతులు ఎదుర్కొన్న వార్నర్‌.. కేవలం 26.46 సగటుతో 397 పరుగులు మాత్రమే చేశాడు. ముఖ్యంగా ఇంగ్లడ్‌ గడ్డపై వార్నర్‌ను బ్రాడ్‌ ఎక్కువసార్లు ఔట్‌ చేశాడు. తన సొంత గడ్డపై 9 సార్లు వార్నర్‌ను పెవిలియన్‌కు పంపాడు.

2013 నుంచి టెస్టుల్లో వార్నర్‌కు బ్రాడ్‌ చుక్కలు చూపిస్తునే వస్తున్నాడు. క్రికెట్‌లో వార్నర్‌ను ఏ బౌలర్‌ కూడా ఇన్ని పర్యాయాలు ఔట్‌ చేయలేదు. వార్నర్‌ను బ్రాడ్‌ ఏకంగా నాలుగు సార్లు డకౌట్‌ చేశాడు. కాగా వార్నర్‌కు ఇదే ఆఖరి యాషెస్‌ సిరీస్‌. కనీసం ఈ సిరీస్‌లోనైనా బ్రాడ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొవాలని అతడి అభిమానులు కోరుకుంటున్నారు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 16 ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 41 పరుగులు చేసింది. క్రీజులో ఉస్మాన్‌ ఖావాజా(22),స్టీవ్‌ స్మిత్‌(7) పరుగులతో ఉన్నారు.
చదవండి: PAK vs SL: శ్రీలంకతో టెస్టు సిరీస్‌.. పాక్‌ జట్టు ప్రకటన!స్టార్‌ బౌలర్‌ వచ్చేశాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement