source: X
వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ టీ20 క్రికెట్‌లో మరో అరుదైన ఘనత సాధించాడు. స్వదేశంలో జరిగే కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో 100 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఈ లీగ్‌లో సెంచరీ వికెట్లు పూర్తి చేసిన ఐదో ఆటగాడయ్యాడు.
2026 ఎడిషన్‌లో భాగంగా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జమైకా కింగ్స్‌మెన్‌కు ఆడుతూ ఈ ఫీట్‌ను నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో అతడు 4 ఓవర్లలో 34 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. దీంతో CPLలో అతడి వికెట్ల సంఖ్య 101కి చేరింది.
రసెల్‌కు ముందు సునీల్ నరైన్ (133), ఇమ్రాన్ తాహిర్ (130), డ్వేన్ బ్రావో (129), జేసన్ హోల్డర్ (110) మాత్రమే CPLలో 100కుపైగా వికెట్లు సాధించారు.
రసెల్ CPLలో కేవలం బంతితోనే కాకుండా బ్యాట్‌తోనూ విధ్వంసకర రికార్డులు సృష్టించాడు. 2021లో జమైకా తరఫున కేవలం 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించి CPL చరిత్రలో అత్యంత వేగవంతమైన అర్ధశతకం రికార్డును నెలకొల్పాడు.
2016లో 42 బంతుల్లో సెంచరీ చేసిన రసెల్.. 2018లో అదే ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌పై కేవలం 40 బంతుల్లో శతకం బాదాడు. అదే మ్యాచ్‌లో హ్యాట్రిక్ కూడా సాధించాడు.
CPL చరిత్రలో రసెల్ బ్యాటింగ్ స్ట్రైక్‌రేట్ 169.36. ఈ విభాగంలో అతడిదే అత్యుత్తమ రికార్డు. 107 ఇన్నింగ్స్‌ల్లో ఈ స్ట్రైక్‌రేట్ సాధించడం అతడి విధ్వంసక బ్యాటింగ్‌కు నిదర్శనం.
IPL నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన రసెల్ 2026లో MLCలో లాస్ ఏంజెల్స్ నైట్ రైడర్స్ తరఫున ఆడి 11 ఇన్నింగ్స్‌ల్లో 18 వికెట్లు తీశాడు. ఇప్పుడు CPLలో 100 వికెట్ల మైలురాయిని అందుకోవడంతో టీ20 క్రికెట్‌లో అతడి సుదీర్ఘ ఆధిపత్యానికి కొనసాగింపు లభించినట్లైంది.
ఇక రసెల్ తాజాగా ఆడిన మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో అతడి జట్టు (జమైకా కింగ్స్‌మెన్) 2 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. రసెల్ తొలుత బ్యాట్‌తో (10 బంతుల్లో 8) ఆకట్టకోలేకపోయాడు. ఆతర్వాత బంతితో రాణించినా అతడి జట్టుకు ఓటమి తప్పలేదు.


