నిధులు పుష్కలం.. అయినా వెచ్చించని దైన్యం | - | Sakshi
Sakshi News home page

నిధులు పుష్కలం.. అయినా వెచ్చించని దైన్యం

Jan 6 2026 2:04 PM | Updated on Jan 6 2026 2:04 PM

నిధుల

నిధులు పుష్కలం.. అయినా వెచ్చించని దైన్యం

విద్యారంగంలో మెరుగైన మార్పులు తీసుకురావడం, పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి స్కూల్‌ ఫర్‌ రైజింగ్‌ ఇండియా(పీఎంశ్రీ) పథకాన్ని తీసుకొచ్చింది. దీనికి కేంద్రం 60శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40శాతం నిధులు సమకూర్చుతోంది. ప్రతి క్వార్టర్‌లో ఆయా పాఠశాలలో చేపట్టాల్సిన కార్యక్రమాలకు నిధులను మంజూరు చేశారు. ప్రీ ప్రైమరీ గ్రాంట్‌, గణితం,సైన్స్‌ ఎక్స్‌పోజర్‌, స్కౌట్స్‌ అండ్‌ గైడ్‌, బతుకమ్మ పండుగ, హౌస్‌ సిస్టమ్‌, స్టూడెంట్‌ కౌన్సిల్‌, స్పోర్ట్స్‌ గ్రాంట్‌, స్పోర్ట్స్‌ ఎక్విప్‌మెంట్‌, స్పోర్ట్స్‌ మీట్‌, వార్షిక మీట్‌, పిల్లల భద్రత, ఐటీ ఇండస్ట్రియల్‌ టూర్‌(వృత్తి విద్య), రా మెటీరియల్‌, క్విజ్‌, మాక్‌ పార్లమెంట్‌, విద్యార్థుల కెరీర్‌ గైడెన్స్‌, సామాజిక భావోద్వేగ శ్రేయస్సు శిక్షణ, ఉన్నత విద్యలో రోల్‌ మోడల్స్‌తో ఇంట్రాక్షన్‌, బాలికల సాధికారత, భద్రత క్లబ్‌లు, యోగా టీచర్‌, స్వీయ రక్షణ, కళ, చేతి పనుల సామగ్రి సేకరించడానికి, స్కూల్‌ గ్రాంట్‌, పేరెంట టీచర్‌ మీటింగ్‌ ఇలా మొత్తంగా 20 కార్యక్రమాలకు గాను 33 పాఠశాలలకు రూ.2,29,18,406 నిధులను మంజూరు చేశారు. మంజూరైన పీఎంశ్రీ నిధులలో డిసెంబర్‌ 31వ తేదీ వరకు కేవలం 8.57ఽశాతం(రూ.19,64,545) నిధులనే వినియోగించారు. మొదటి క్వార్టర్‌ నిధులను పూర్తి స్థాయిలో ఖర్చు చేసిన వారికి మరో విడత నిధులను మంజూరు చేయనున్నారు. ఈ నిధులు వినియోగించకపోతే కొత్తగా నిధులు రాకపోవడంతో పాటు పాతవి మంజూరైనవి తిరిగి వెళ్లే అవకాశాలున్నాయి. గతంలో పీఎంశ్రీ నిధులు నేరుగా ఆ పాఠశాల హెచ్‌ఎంకు చెందిన బ్యాంక్‌ ఖాతాలో జమ అయ్యేవి. దీంతో నిధుల దుర్వినియోగం జరిగినట్లు ప్రభుత్వం నిర్థారించింది. ఈ సంవత్సరం కార్యక్రమాల వారీగా నిధులను మంజూరు చేశారు. మొదట హెచ్‌ఎం ఖర్చు చేసి ఆ బిల్లులు పెట్టి ట్రెజరీ ద్వారా విడుదల చేసుకోవాలి. ఇలా పెట్టడటంతో కార్యక్రమాలు నిర్వహించేందుకు హెచ్‌ఎంలు ఎవరు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. మరికొందరు కార్యక్రమం చేసినప్పటికీ తక్కువ బిల్లును ఎక్కువగా ఎలా పెట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికై నా ఉన్నత అఽధికారులు స్పందించి పీఎంశ్రీ నిధులు వినియోగించి, విద్యార్థులకు విజ్ఞానం అందించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

మొదటి విడతగా జిల్లాలో 33 పాఠశాలల ఎంపిక 20 కార్యక్రమాలకు రూ.2.29 కోట్లు మంజూరు ఇప్పటి వరకు ఖర్చు చేసింది 8.5 శాతమే మూలుగుతున్న రూ.2.09 కోట్లు

పీఎంశ్రీ కింద మంజూరైన కార్యక్రమాలను వేగిరం చేస్తాం. కొంత నెమ్మదిగా కార్యక్రమాలు జరుగుతున్న మాట వాస్తవమే. రోజూ హెచ్‌ఎంలతో మాట్లాడుతున్నా. వారంలో ఒక రోజు జూమ్‌ మీటింగ్‌ ఏర్పాటు చేసి ఆదేశాలు ఇస్తున్నా.

నిధులు మంజూరైనా ఖర్చు చేయకుండా పీఎంశ్రీ పథకాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రధానమంత్రి స్కూల్‌ ఫర్‌ రైజింగ్‌ ఇండియా(పీఎంశ్రీ) పథకం కింద జిల్లా వ్యాప్తంగా మొదటి విడతలో 33 పాఠశాలను ఎంపిక చేశారు. 2025–26 మొదటి క్వార్టర్‌లో రూ.2.29కోట్లు మంజూరు చేశారు. ఇప్పటి వరకు రూ.19.64లక్షలు మాత్రమే ఖర్చు చేయగా రూ.2.09కోట్ల నిధులు మూలుగుతున్నాయి. మంజూరైన నిధులు ఖర్చు చేస్తేనే మరో విడత మంజూరుకానున్నాయి. పీఎంశ్రీ పాఠశాలలకు చెందిన హెచ్‌ఎంలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం వల్లే ఆ పథకం లక్ష్యం నెరవేరడం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

– సాక్షి, సిద్దిపేట

రూ.2.29 కోట్లు మంజూరు

8.57 శాతం నిధులే వినియోగం

వేగిరం చేస్తాం..

– శ్రీనివాస్‌ రెడ్డి, డీఈఓ

నిధులు పుష్కలం.. అయినా వెచ్చించని దైన్యం1
1/3

నిధులు పుష్కలం.. అయినా వెచ్చించని దైన్యం

నిధులు పుష్కలం.. అయినా వెచ్చించని దైన్యం2
2/3

నిధులు పుష్కలం.. అయినా వెచ్చించని దైన్యం

నిధులు పుష్కలం.. అయినా వెచ్చించని దైన్యం3
3/3

నిధులు పుష్కలం.. అయినా వెచ్చించని దైన్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement