ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయండి
జిల్లా ఇంటర్ విద్యాధికారి రవీందర్‌రెడ్డి
దుబ్బాక: విద్యార్థులు ఎలాంటి, ఒత్తిడి భయం లేకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి రవీందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం దుబ్బాక ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆయన సందర్శించారు. ఇంటర్ ప్రీ ఫైనల్ పరీక్షలు, రోజూ నిర్వహించే యోగా తదితర సాంస్కృతిక కార్యక్రమాలను పరిశీలించారు.ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేలా రోజూ 20 నిమిషాల పాటు యోగా తరగతులతో పాటు వివిధ రకాల అంశాలపై చైతన్యపరుస్తున్నామన్నారు. వార్షిక పరీక్షలు ఏ విధంగా ఉంటాయన్న విధానాన్ని ప్రస్తుతం జరుగుతున్న ప్రీ ఫైనల్ పరీక్షలతో విద్యార్థులకు అవగాహన ఏర్పడుతుందన్నారు. కార్యక్రమంలో కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ విజయేందర్‌రెడ్డి, లెక్చరర్లు తదితరులు ఉన్నారు.
మద్దూర్(హుస్నాబాద్): మండల తహసీల్దార్ కార్యాలయాన్ని అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలో రికార్డుల నిర్వహణ, రెవెన్యూ సేవల పురోగతి పరిశీలించారు. సాదా బైనామా దరఖాస్తులు, రెవెన్యూ సదస్సుల పరిష్కారాలు, భూ భారతి దరఖాస్తులపై అడిగి తెలుసుకున్నారు. అలాగే పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కోరారు.
వార్డుల్లో మున్సిపల్ కమిషనర్ పర్యటన
సిద్దిపేటజోన్: పట్టణంలోని పలు వార్డుల్లో మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్‌కుమార్ మంగళవారం ఉదయం పర్యటించారు. ఈ మేరకు పట్టణంలోని 15వ వార్డు ఇమాంబాద్‌లోని ఎస్సీ కాలనీలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ పనులు పూర్తిపై ఆరా తీశారు. తాగునీటి, విద్యుత్ సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం 23వ వార్డులో పర్యటించిన కమిషనర్ మురికి కాలువల్లో చెత్త పడకుండా జాలీలను ఏర్పాటు చేయాలన్నారు. రైతు బజార్ వద్ద వాహనాలు నిలపడం వల్ల పార్కింగ్ సమస్యలతో కూరగాయల వినియోగదారులకు ఇబ్బందులు పడుతున్నారని కమిషనర్ దృష్టికి తీసుకురాగా, వెంటనే పోలీస్ అధికారులకు సమాచారం అందించి సమస్యను పరిష్కరిస్తామన్నారు. అనంతరం 6వ వార్డు హనుమాన్ నగర్‌లో నూతన సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు.
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర వనవాసి కో కన్వీనర్‌గా పరశురాం నాయక్‌ను ఎన్నుకున్నట్లు ఏబీవీపీ జిల్లా కన్వీనర్ ఆదిత్య మంగళవారం తెలిపారు. ఏబీవీపీ 44వ రాష్ట్ర మహాసభలు శంషాబాద్‌లో జరిగాయని, ఈ మహాసభల్లో విద్యారంగ అభివృద్ధికి అనేక తీర్మానాలు చేసినట్లు తెలిపారు.
చేర్యాల(సిద్దిపేట): మండల పరిధిలోని నాగపురి గ్రామానికి చెందిన పలు పార్టీల నాయకులు మంగళవారం కాంగ్రెస్ పార్టీ జనగామ నియోజకవర్గ ఇన్‌చార్జి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీకండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కొమ్మూరి మాట్లాడుతూ గ్రామాల్లో ఎన్నో అభివృద్ధి పనులు చేశామని, మరింత అభివృద్ధి చేసే దిశగా తన వంతు సహకారం అందిస్తానన్నారు. త్వరలో జరిగే మున్సిపల్, స్థానిక ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ప్రతీ కార్యకర్త కృషి చేయాలన్నారు. ఆయన వెంట మండల, పట్టణ నాయకులున్నారు.
ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయండి
ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయండి
ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయండి


