చైతన్యపరుస్తున్నాం
ఆన్‌లైన్ గేమ్ మాయలో...
క్యాసినోతోపాటు ఆన్‌లైన్ గేమ్ మాయ ఎంతోమందిని ఆగాధంలోకి నెట్టేస్తున్నది. రూపాయి పెట్టుబడిగా పెడితే.. పది రూపాయలు ఇస్తామంటూ ఇందులోకి దింపుతున్నారు. చిన్నపిల్లలు మొదలుకొని అన్ని వయసులు వారు ఈ గేమ్‌ల బారిన పడి తీవ్రంగా నష్టపోతున్నారు. గేమ్‌లు ఆడటానికి ఆన్‌లైన్ యాప్‌ల్లోనే అప్పులు చేస్తున్నారు. డబ్బులు వసూలు చేయడానికి యాప్‌ల నిర్వాహకులు రకరకాలుగా వ్యక్తులు వేధింపులకు గురిచేస్తున్నారు. మరికొందరూ యాప్‌ల నిర్వాహకులైతే మరో అడుగు ముందుకేసి.. ఆన్‌లైన్‌లో నగ్న చిత్రాలు పెడతామంటూ హెచ్చరిస్తున్నారు.
ఆన్‌లైన్ గేమ్‌ల వల్ల జరుగుతున్న నష్టాలను వివరిస్తూ ప్రజలను చైతన్యపరచడానికి కళాబృందాలతో ప్రదర్శనలు నిర్వహిస్తున్నాం. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఉండాలి. అవసరమైతే కౌన్సిలింగ్ కోసం మా సహకారాన్ని అందిస్తాం. ఇవీ పూర్తిగా చట్టవ్యతిరేకమైనవి. – నర్సింహులు, గజ్వేల్ ఏసీపీ


