హెల్మెట్ ధారణ.. ప్రాణాలకు రక్షణ
సిద్దిపేటకమాన్: ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్‌పర్సన్, ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి అన్నారు. కోర్టులో రహదారి భద్రత కార్యాచరణ పోస్టర్‌ను సోమవారం ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ వాహనదారులు హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించి వాహనాలు నడపాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని సూచించారు. మైనర్ డ్రైవంగ్ చట్టరీత్యా నేరమని తెలిపారు. ఈ నెల 5నుంచి 9వ తేదీ వరకు నిర్వహించనున్న లీగల్ అవేర్‌నెస్ కార్యక్రమంలో అందరూ పాల్గొని వినియోగించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో అదనపు డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి జయప్రసాద్, సీనియర్ సివిల్ జడ్జి సంతోష్‌కుమార్ పాల్గొన్నారు.
అభివృద్ధి పనులపై
మంత్రి ఓఎస్డీ సమీక్ష హుస్నాబాద్‌రూరల్: అక్కన్నపేట, హుస్నాబాద్ మండలాల్లోని అభివృద్ధి పనులపై సర్పంచ్‌లతో ఐఓసీ భవనంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఓఎస్డీ శ్రీనివాస్‌రెడ్డి, పీఆర్ అధికారులు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పీఆర్ డీఈ మహేశ్ మాట్లాడుతూ గ్రామాల్లో మంజూరైన పనులను ప్రారంభించి పూర్తి చేయాలన్నారు. గ్రామాల్లో సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు అధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పారు. మహిళా భవనాలు, పంచాయతీ భవనాలకు స్థలాలను గుర్తించి పనులు చేపట్టాలన్నారు. సమావేశంలో ఎంపీడీఓ రమేశ్, ఎంపీఓ మోహన్, అధికారులు పాల్గొన్నారు. నూతన ఆవిష్కరణలపై అవగాహన హుస్నాబాద్: శాతవాహన విశ్వవిద్యాలయం హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం నూతన ఆవిష్కరణలపై జాతీయ స్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సును ఉపకులపతి ఉమేశ్‌కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య వక్తగా డాక్టర్ శంకర్‌రావు పాల్గొని ఐపీఆర్, పేటెంట్లపై ప్రెజెంటేషన్ ఇచ్చారు. అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని పరిశోధన, ఆవిష్కరణ లపై అవగాహన పొందారు.
మంత్రి హామీ ఏమాయె హుస్నాబాద్‌రూరల్: పొట్లపల్లి స్వయంభూ రాజేశ్వరస్వామి దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్.. రెండేళ్లు గడిచినా పట్టించుకోవడంలేదని హిందూ సంఘాల ప్రతినిధులు ఆరోపించారు. ఈ మేరకు సోమవారం ఆలయం ఎదుట హిందూ సంఘాల ప్రతినిధులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బత్తుల శంకర్‌బాబు మాట్లాడుతూ అభివృద్ధి చేస్తానని పొట్లపల్లి స్వయంభూ రాజేశ్వరస్వామి ఆలయ సన్నిధిలోనే బాండ్ పేపరు రాసి ఇచ్చిన హామీలు ఏమ య్యాయని ప్రశ్నించారు. ఆలయ నిధులు ఉన్నప్పటికీ రాజగోపురం పనులు ఎందుకు చేపట్టడం లేదన్నారు. హుస్నాబాద్ ఎల్లమ్మ దేవాలయాన్ని అభివృద్ధి చేసినట్లు పొట్లపల్లి అలయాన్ని సైతం అభివృద్ధిచేయాలన్నారు. కార్యక్రమంలో పెందొట అనిల్, గొల్లపల్లి వీరాచారి, రాంప్రసాద్, అనంతస్వామి, రాజేందర్, లక్ష్మయ్య పాల్గొన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి
హిందూ సంఘాల నిరసన
నంగునూరు
తహసీల్దార్‌గా ప్రవీణ్‌రెడ్డి
నంగునూరు(సిద్దిపేట): సిద్దిపేట కలెక్టరేట్‌లో విధులు నిర్వహిస్తున్న ప్రవీణ్‌రెడ్డి నంగునూరు తహసీల్దార్‌గా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. నారాయణరావుపేట డిప్యూటీ తహసీల్దార్‌గా పని చేసిన మాధవికి నంగునూరు తహసీల్దార్‌గా పూర్తి బాధ్యతలు అప్పగించగా ఆమె తిరిగి స్వస్థలానికి బదిలీ అయ్యారు.
1/1
హెల్మెట్ ధారణ.. ప్రాణాలకు రక్షణ