లిమ్కా బుక్‌లోకి అన్నదమ్ముల ‘కిక్స్’
గజ్వేల్‌రూరల్: ఆ ఇద్దరు అన్నదమ్ములు కరాటేలో సత్తాచాటారు. గజ్వేల్ పట్టణానికి చెందిన రామకోటి భక్తసమాజం వ్యవస్థాపక అధ్యక్షుడు రామకోటి రామరాజు–పుష్ప దంపతుల కుమారులు రామకృష్ణ, రఘురాంలు హైదరాబాద్‌లో జరిగిన కరాటే పోటీల్లో 30 నిమిషాల్లో 600 కిక్స్ చాలెంజ్‌లో ప్రతిభ చాటారు. లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకోవడంతో పాటు బంగారు పతకం, ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా గజ్వేల్ పట్టణానికి చెందిన పలువురు అభినందించారు.
రేపు మ్యాథమెటిక్స్
టాలెంట్ టెస్ట్
గజ్వేల్‌రూరల్: రాష్ట్రస్థాయి మ్యాథమెటిక్స్ టాలెంట్ టెస్ట్‌ను ఈనెల 6న గజ్వేల్‌లో నిర్వహించనున్నట్లు టీఎంఎఫ్ (తెలంగాణ మ్యాథమెటిక్స్ ఫోరం) జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, కోశాధికారి వెంకటేశ్వర్లులు తెలిపారు. ఆదివారం గజ్వేల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ గజ్వేల్ పట్టణంలోని బాలికల ఎడ్యుకేషన్ హబ్‌లోగల మోడల్‌స్కూల్‌లో టెస్ట్‌ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ టాలెంట్ టెస్ట్‌లో రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమానికి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నవీన్ నికోలస్, డైరెక్టర్ ఎస్‌సీఈఆర్‌టీ రమేష్, కలెక్టర్ హైమావతి, డీఈవో శ్రీనివాస్‌రెడ్డి తదితరులు హాజరవుతున్నట్లు చెప్పారు.
డ్రైవర్లూ.. ఆరోగ్యం జాగ్రత్త
ఎంవీఐ శంకర్ నారాయణ
సిద్దిపేటకమాన్: డ్రైవర్లు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలని మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ (ఎంవీఐ) శంకర్ నారాయణ తెలిపారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకుని సిద్దిపేట మోడ్రన్ బస్టాండ్ వద్ద వైద్య శిబిరం నిర్వహించారు. భారీ వాహనాల డ్రైవర్లు, ఆటో డ్రైవర్లకు ఆరోగ్య, కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర్ నారాయణ మాట్లాడుతూ.. డ్రైవర్లు ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉంటూ ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండటం డ్రైవింగ్ వృత్తిలో ఉన్నవారికి చాలా అవసరమన్నారు. కార్యక్రమంలో మెడికల్, ఆర్టీసీ అధికారులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల్లో గొల్ల, కురుమలకు
అవకాశాలివ్వాలి
దుబ్బాక: మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అన్ని పార్టీలు జనాభా ప్రతిపాదికన గొల్ల, కురుమలకు అవకాశాలివ్వాలని అఖిల భారత యాదవమహాసభ రాష్ట్ర కార్యదర్శి పోచబోయిన శ్రీహరి యాదవ్ అన్నారు. ఇటీవల గెలుపొందిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులను గొర్రెల కాపరుల సహకార సంఘం ఆధ్వర్యంలో ఆదివారం దుబ్బాక పట్టణంలో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొల్ల కురుమలను కేవలం ఓటు బ్యాంకుగానే రాజకీయ పార్టీలు వాడుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రాజేశ్వర్‌యాదవ్, చిర్ర తిరుపతి, శ్రీనివాస్‌యాదవ్, ప్రశాంత్, పోచమల్లు, ఎల్లయ్య, మల్లేశం, శ్రీకాంత్ యాదవ్,చంద్రం, నాయకులు ఉన్నారు.
లిమ్కా బుక్‌లోకి అన్నదమ్ముల ‘కిక్స్’
లిమ్కా బుక్‌లోకి అన్నదమ్ముల ‘కిక్స్’


